ETV Bharat / sports

ఐపీఎల్​లో రోహిత్ మరో ఘనత- దిల్లీపై క్రేజీ రికార్డ్ - Rohit Sharma IPL Record - ROHIT SHARMA IPL RECORD

Rohit Sharma IPL Record: ముంబయి వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్​లో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. ఈ క్రమంలో రోహిత్ ఐపీఎల్​లో ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు.

rohit sharma ipl record
rohit sharma ipl record
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:21 PM IST

Updated : Apr 7, 2024, 5:34 PM IST

Rohit Sharma IPL Record: ముంబయి ఇండియన్స్​ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్​లో మరో రికార్డ్ సాధించాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​పై ఇప్పటికే 1000+ పరుగులు బాదిన రోహిత్, తాజాగా దిల్లీ క్యాపిటల్స్​పై కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. దిల్లీపై 34 ఇన్నింగ్స్​ ఆడిన రోహిత్ 1000కి పైగా పరుగులు బాదాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దీంతో ఐపీఎల్​లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు సాధించిన మూడో బ్యాటర్​గా నిలిచాడు. కాగా, ఇప్పటికే విరాట్ కోహ్లీ చెన్నై, దిల్లీపై, డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లపై ఈ ఫీట్ సాధించారు. ఇక దిల్లీపై విరాట్ తర్వాత 1000 పరుగుల మార్క్ అందుకుంది హిట్​మ్యానే.​

ఇక ఈ మ్యాచ్​లో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. రోహిత్ ముంబయికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. తొలి ఓవర్​ నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ (49 పరుగులు 27 బంతుల్లో ; 6x4, 3x6) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (42 పరుగులు, 23 బంతుల్లో ; 4x4, 2x6) అదరగొట్టాడు. వీరిద్దరి ధాటికి పవర్​ప్లేలో ముంబయి 75 పరుగులు చేసింది.

పవర్​ప్లే తర్వాత వరుస ఓవర్లలో రోహిత్, సూర్య కుమార్ యాదవ్ (0) పెలివియన్ చేరారు. ఆ తర్వాత ఇషాన్ కూడా అక్షర్ బౌలింగ్​లో క్యాచౌట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా (6) స్వల్ప స్కోర్​కే వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య (39 పరుగులు, 33 బంతుల్లో) కాస్త నెమ్మదిగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇక చివరి 5 ఓవర్లలో మాత్రం ముంబయి బ్యాటర్లు టిమ్ డేవిడ్ (45 పరుగులు), రొమారియో షెపర్డ్ (39 పరుగులు, 10 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ముంబయికి చివరి 30 బంతుల్లో 96 పరుగులు వచ్చాయి.

'ముంబయి కాకపోతే కోల్​కతా కెప్టెన్ అవుతా'!- రోహిత్ షాకింగ్ డెసిషన్- వీడియో వైరల్ - Rohit Sharma KKR IPL

రాజస్థాన్​ మ్యాచ్​లో రోహిత్ శర్మనే భయపెట్టేసిన అభిమాని - IPL 2024 RR VS MI

Last Updated : Apr 7, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.