Rohit Sharma Hardik Pandya Controversy: టీమ్ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చాలా స్పెషల్ మూమెంట్స్ వైరల్‌గా మారాయి. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యని హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకోవడం కూడా ఒకటి. ఇది ఎందుకింత వైరల్‌గా మారిందో అందరికీ తెలిసే ఉంటుంది. గత ఐపీఎల్‌కి ముందు ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ని తప్పించిన యాజమాన్యం పాండ్యకి పగ్గాలు అప్పగించింది. ఈ అంశం ఇద్దరి మధ్య దూరం పెంచుతుందని చాలా మంది భావించారు.
ఇక ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎన్నికైన హార్దిక్ టోర్నీమొత్తం పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. దానికితోడు గత ఎడిన్లో ముంబయి విఫలమైంది. ఈ వ్యవహారంపై రోహిత్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు రోహిత్, హార్దిక్ తమ మధ్య అంతర్గత విభేదాలు? వాటిని ఎలా పరిష్కరించుకున్నారో లైవ్‌లో చూసిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఒకరు రీసెంట్గా తెలిపారు.
'నేను నెట్స్‌కి వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ మధ్య ఏం జరుగుతుందో గమనించాను. తొలిరోజు వారిద్దరు మాట్లాడుకోలేదు. ఒకరికొకరు దూరంగా ఉన్నారు. కానీ, రెండో రోజు ఒకరి వెనక మరొకరు రావడం చూశాను. అంతే కాదు ఒక దగ్గర కూర్చొని చాలా సేపు మాట్లాడుతున్నారు. రోహిత్, హార్దిక్ మాట్లాడుకుంటున్న విధానం గమణించి నేను చూస్తుంది నిజమేనా? అనుకున్నాను' అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ రీసెంట్గా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
'కొన్ని రోజులు, రోహిత్, హార్దిక్ ప్రాక్టీస్ సమయంలో సన్నిహితంగా కలిసి పని చేయడం, టిప్స్ షేర్ చేసుకోవడం, గేమ్ ప్లాన్స్ గురించి చర్చించుకోవడం కనిపించింది. వారి రిలేషన్‌లో ఈ సానుకూల మార్పు రిలాక్స్డ్, సపోర్టివ్ టీమ్ వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడింది. ఇది భారత్ ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించింది' అని విమల్ తెలిపారు. కాగా, జూన్ 29న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన టీమ్ఇండియా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
Hardik Pandya was booed at Wankhede Stadium in every match of IPL.
— Incognito (@Incognito_qfs) July 4, 2024
Today, the same Wankhede Crowd cheered his name.
This is how a World Cup changes your life. pic.twitter.com/in2VPYyddr
'అందుకే హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వలేదు - సూర్యకుమార్ బెస్ట్' - Hardik Suryakumar yadav
'రోహిత్ శర్మ చాలా కాస్ట్లీ - అతడిని కొనడం కష్టమే!' - IPL 2025 Rohit Sharma