Rohit on Virat T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమ్ఇండియా జట్టులో ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన ఉద్దేశాన్ని రోహిత్ రీసెంట్గా బీసీసీఐ సెక్రటరీ జై షాతో చెప్పినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్ 2024 టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిందేనని జై షాతో రోహిత్ చెప్పినట్లు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కిరిటి అజాద్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 'టీ20 టీమ్‌లో విరాట్ స్థానం గురించి జై షా కెప్టెన్ రోహిత్‌ను అడిగాడు. 'ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు విరాట్ కావాల్సిందే' అని రోహిత్ కూడా షాతో చెప్పాడు. అయితే విరాట్ కచ్చితంగాటీ20 వరల్డ్‌కప్‌లో ఆడతాడు. దీనిపై వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు ముందే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది' అని కిరిటి ట్వీట్లో రాసుకొచ్చాడు.
అవన్నీ పుకార్లే: అయికే రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి విరాట్ కోహ్లీని టీమ్ఇండియా సెలక్టర్లు పక్కన పెట్టనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఖండించాడు. అవన్నీ ఉత్తి పుకార్లేనని, ఎలాంటి పనిలేని వ్యక్తులు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారని అన్నాడు. 'టీ20 వరల్డ్‌కప్ అయినా, వన్డే ప్రపంచకప్ అయినా టీమ్ఇండియాలో విరాట్ ఉండాల్సిందే. జట్టులో అతడిది కీలక పాత్ర. విరాట్ లేకుండా టీమ్ఇండియా రాణించడం కష్టం. 100 శాతం జట్టులో విరాట్ ఉండాల్సిందే. 2011 వరల్డ్‌కప్‌లో సచిన్ తెందూల్కర్‌కు దక్కిన గౌరవం ఇప్పుడు విరాట్‌కు కూడా దక్కాల్సిందేనని నమ్ముతున్నా. విరాట్ కోసం టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గాలి. తన కెరీర్లో అది అతి పెద్ద విషయం' అని శ్రీకాంత్ ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడారు.
2024 T20 World Cup Schedule: ఇక 2024 జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. జూన్ 2న కెనడా- యూఎస్‌ఏ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 9న తలపడనుంది.
కింగ్ కోహ్లీ వచ్చేశాడు -కొత్త లుక్‌లో IPLకి రెడీ- ఫొటోస్ చూశారా?
'విరాట్ లేకుండా అసాధ్యం- సచిన్ లాగే కోహ్లీకి గౌరవం దక్కాలి'