Pant Sets Fielding For BAN : భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో శనివారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. క్రీజులో ఉన్న టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ కాసేపు బంగ్లాదేశ్ ప్లేయర్‌గా మారిపోయాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నానని మరిచిపోయాడో, లేక బంగ్లాదేశ్ కెప్టెన్‌ను సరదాగా ఆట పట్టించాలని చూశాడో తెలీదు. కానీ, ఓ దశలో పంత్ బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేశాడు. దీంతో నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ వైరల్‌గా మారిపోయింది. మరి అక్కడ ఏమైందంటే?
టీమ్ఇండియా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మూడో రోజు తొలి సెషన్‌ను ఘనంగా ఆరంభించారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలుత మెహిదీ హసన్, ఆ తర్వాత పేసర్లను రంగంలోకి దింపినా గిల్ - పంత్ జోడీ అస్సలు తగ్గలేదు. ఈ క్రమంలో వీళ్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో కెప్టెన్ షాంటోకి అర్థం అవ్వలేదు. వెంటనే పంత్ 'అరే భాయ్ లెగ్‌సైడ్ ఒక ఫీల్డర్ తక్కువయ్యాడు. ఇటువైపు ఒకరిని ఉంచు' అని మిడ్‌వికెట్ వైపు చేయి చూపుతూ షాంటోతో అన్నాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.
అయితే షాంటో కూడా పంత్ సూచించినట్లు ఫీల్డర్‌ను సెట్ చేయ్యడం ఇక్కడ విశేషంగా మారింది. దీంతో ఒక్కసారిగా కామెంటర్లు కూడా నవ్వుకున్నారు. 'గతంలో ధోనీ కూడా బంగ్లాతో మ్యాచ్‌లో ఇలాగే చేశాడు', 'టీమ్ఇండియా ఈ మ్యాచ్‌ను వార్మప్‌లా భావిస్తుంది', 'ఎంటర్టైన్ చేయడంలో పంత్ ఎప్పుడూ ముందుంటా' అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Always in the captain’s ear, even when it’s the opposition’s! 😂👂
— JioCinema (@JioCinema) September 21, 2024
Never change, Rishabh Pant! 🫶🏻#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/PgEr1DyhmE
637 రోజుల తర్వాత పంత్ టెస్ట్ సెంచరీ - గిల్ కూడా అదిరే శతకం - Panth Gill Century