Rishabh Dhawan Video Game: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఆటకు దూరమైన పంత్, మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ సాధించేందుకు పంత్ జిమ్‌లో కసరత్తులు, నెట్స్‌లో గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పంత్ కాస్త రిలాక్స్ అవుతున్నాడు.
తాజాగా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఓ వీడియో గేమ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్కేడ్ వీడియో గేమ్స్ (Arcade Video Game) ఆడుతూ ధావన్‌తో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించి ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. కాగా, ధావన్ కూడా 2024 ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నాడు. రానున్న ఐపీఎల్లో ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
గోళీలు ఆడుతూ: తాజాగా వీడియో గేమ్‌తో రిలాక్స్ అవుతున్న పంత్, రీసెంట్గా రోడ్డు పక్కన చిన్న పిల్లలతో గోళీల ఆట ఆడుతూ కనిపించాడు. . ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు. వాళ్లలో తాను ఓ పిల్లాడిలాగా కలిసిపోయి సీరియస్‍గా ఆటలో నిమగ్నమైపోయాడు. సరదాగా ఆడుతూ ఆ చిన్నారులతో ముచ్చటించాడు. ఇక ఆ వీడియోను పంత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.
ఇక పంత్ గైర్హాజరీలో గతేడాది ఐపీఎల్లో దిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చించింది. పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2023లో దిల్లీకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక దిల్లీ గతేడాది పాయింట్ల టేబుల్లో 9వ స్థానంతో టోర్నీని ముగించింది. కాగా, ఈ సీజన్లో మార్చి 23న పంజాబ్‌తో దిల్లీ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే పంత్ గాయాల నుంచి పూర్తిగా కోలుకొని ఈ సీజన్లోనైనా అందుబాటులో ఉండాలని దిల్లీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Delhi Capitals 2024 IPL: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ప్రవీణ్ దూబే, అన్రిచ్ నొకియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగ్డీ, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకే ధుల్ , హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార.
పిల్లాడిలా మారిపోయిన స్టార్ క్రికెటర్ - రోడ్డుపై గోళీలు ఆడిన పంత్