ETV Bharat / sports

IPL రిటెన్షన్స్: RTM కార్డ్ నయా రూల్- ఎవరికి లాభం?

రిటెన్షన్​కు దగ్గరపడ్డ సమయం- అందరి దృష్టి మెగావేలంపైనే- ఈసారి కొత్త రూల్​లో RTM

RTM Card Use
RTM Card Use (Source: ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

2025 IPL RTM Card Rule : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్​కు సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటున్నాయి? ఎవరిని వేలంలోకి వదిలేస్తున్నాయి? అనే జాబితాను మరో 24 గంటల్లో బోర్డుకు సమర్పించాల్సి ఉంది. గురువారం (అక్టోబర్ 31) సాయంత్రం 5.00 గంటలలోపు అన్ని జట్లు రిటెన్షన్ లిస్ట్​ రిలీజ్ చేయాల్సి ఉంది.

అయితే ఈసారి రిటెన్షన్స్​లో రైట్ టు మ్యాచ్ (RTM) ఆప్షన్ కూడా ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంది. ఐదుగురు ప్లేయర్లు, ఒక ఆర్​టీఎమ్​తో గరిష్ఠంగా ఒక్కో జట్టు ఆరుగురు ప్లేయర్లను జట్టులో కొనసాగించవచ్చు. ఇక ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే ఆ ఫ్రాంచైజీకి మూడు ఆర్​టీఎమ్​లు అందుబాటులో ఉంటాయి. అదే ఒక్క ప్లేయర్​ను కూడా నేరుగా అట్టిపెట్టుకోకుంటే, ఆ ఫ్రాంచైజీకి ఆరు ఆర్​టీఎమ్​ కార్డు ఆప్షన్లు ఉంటాయి. అయితే ఈసారి ఆర్​టీఎమ్​ రూల్స్ కాస్త మార్చారు. మరి ఆర్​టీఎమ్ కార్డు ఏంటి? మారిన రూల్ ఏంటో తెలుసుకుందాం.

  • ఈ ఆర్​టీఎమ్ తొలిసారి 2017 ఐపీఎల్ వేలంలో తీసుకొచ్చారు. అయితే పలు కారణాల వల్ల దీన్ని 2022 సీజన్​లో తొలగించారు. ఇక 2025 మెగా వేలం సందర్భంగా మళ్లీ ఈ ఆర్​టీఎమ్​ కార్డును తీసుకొచ్చారు
  • ఏదైనా ఫ్రాంచైజీ తమ ప్లేయర్​ను వేలంలోకి రిలీజ్ చేస్తే, అతడిని ఇతర జట్లు కావాలనుకుంటే బిడ్డింగ్ వేసి దక్కించుకుంటాయి. ఆ ప్లేయర్ బిడ్డింగ్​ పూర్తైన తర్వాత, పాత ఫ్రాంచైజీ మళ్లీ అతడిని కావాలని కోరుకుంటే, ఆర్​టీఎమ్​ ఉపయోగించి తిరిగి పొందవచ్చు. ఇదంతా పాత పద్ధతి. ఈసారి ఆర్​టీఎమ్ నిబంధన మారింది
  • కొత్త రూల్ ప్రకారం, ప్లేయర్ కోసం బిడ్ వేసిన ఫ్రాంచైజీకి ఆ ఆటగాడిని దక్కించుకోవడానికి అదనంగా ఛాన్స్ ఉంది. అంటే వేలంలో దక్కించుకున్న ఆ ప్లేయర్​ను సదరు ఫ్రాంచైజీ కావాలనుకుంటే మరోసారి బిడ్ పెంచవచ్చు.
  • ఉదాహరణకు, ముంబయి ప్లేయర్​ను దిల్లీ రూ.10 కోట్లకు వేలంలో దక్కించుకుంది. వేలం ముగిసిన తర్వాత ముంబయికి ఆ ప్లేయర్ కావాలనిపిస్తే ఆర్​టీఎమ్​తో రూ.10 కోట్లు చెల్లించి తిరిగి జట్టులోకి తీసుకోవచ్చు
  • అయితే ముంబయి అలా కావాలనుకున్నప్పుడు, దిల్లీ ఆ ప్లేయర్​పై మరోసారి బిడ్ వేయవచ్చు. అలా దిల్లీ ఆ ప్లేయర్​కు గరిష్ఠంగా రూ.12 కోట్ల వరకూ బిడ్ వేసింది అనుకుందాం. ఇప్పుడు ముంబయి అతడిని తిరిగి పొందాలంటే రూ.12 కోట్లు వెచ్చించాలి. లేదంటే ఆ ఆటగాడు దిల్లీకి రూ.12 కోట్లకు సొంతం అవుతాడు
  • ఒకవేళ దిల్లీ రూ.10 కోట్ల వద్దే బిడ్డింగ్​ ఆపేస్తే, ముంబయి అదే రూ.10 కోట్లు చెల్లించి సదరు ప్లేయర్​ను తిరిగి జట్టులోకి తీసుకోవచ్చు. అలా కొత్త రూల్ ప్రకారం ఆటగాళ్లకు లాభం చేకూరే ఛాన్స్ ఉంది
  • ఒక్కో జట్టు గరిష్ఠంగా ఆరుగురు (ఆర్​టీఎమ్​తో కలిపి) ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు

క్రికెట్ ఫ్యాన్స్​కు బిగ్ న్యూస్- IPL రిటెన్షన్స్​ లైవ్ స్ట్రీమింగ్​- డీటెయిల్స్ ఇవే!

రూ.120కోట్ల పర్స్​ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్​లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.