ETV Bharat / sports

RCB నయా హీరో యశ్- అంతా అదృష్టం కలిసిరావడం వల్లే! - IPL 2024 - IPL 2024

Yash Dayal IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాల్ ఒక్క మ్యాచ్​తో హీరో అయ్యాడు. అదృష్టం కలిసి రావడం వల్ల చెన్నైతో మ్యాచ్​లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదెలాగంటే?

yash dayal IPl
yash dayal IPl (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 11:06 AM IST

Updated : May 19, 2024, 11:39 AM IST

Yash Dayal IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ సీజన్​ సెకండ్ హాఫ్​లో అసాధారణ ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో నెగ్గి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అయితే పేసర్ యశ్ దయాల్ బెంగళురు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో చెన్నైని 17 పరుగులలోపే కట్టడి చేసి జట్టును ప్లేఆఫ్స్​కు చేర్చాడు. ఈ విషయంలో అతడికి కాస్త అదృష్టం కూడా తోడైంది. అదెలాగంటే?

అయితే మ్యాచ్​కు ముందు చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురిసింది. దానివల్ల మైదానంలో తేమ ఎక్కువైంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్​లో బంతిపై గ్రిప్ దొరకక బౌలర్ చేతుల్లోంచి జారిపోతుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. బంతిని మార్చవలసిందిగా కోరాడు. అయితే అంపైర్లు దానికి నిరాకరించారు. బంతి మార్చే ఛాన్స్ లేదని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అదే బంతితో యశ్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది.

5 బంతుల్లో 11 పరుగులు కట్టడి
ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవ్వలంటే చెన్నైకి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావాలి. క్రీజులో ఫినిషర్ కింగ్ ధోనీ, నాన్ స్ట్రైక్ ఎండ్​లో రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ సమయంలో డూప్లెసిస్ యశ్ దయాల్​కు బంతినిచ్చాడు. 'దయాల్, ధోనీని ఆపగలడా?' అని అందరిలో సందేహం మొదలైంది. అనుకున్నట్లే తొలి బంతిని ధోనీ సిక్స్​గా మలిచాడు. ఒక్కసారిగా సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.

ఇక సీఎస్కే శిబిరంలో గెలుస్తామన్న ధీమా కనిపించింది. కానీ, ధోనీ బాదిన ఆ సిక్స్ ఏకంగా 110 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో బంతి స్టేడియం బయట పడింది. అంతే అంపైర్లు ఇంకో బంతిని తెప్పించాల్సి వచ్చింది. ఇక కొత్త బంతితో దయాల్​కు గ్రిప్ దొరికింది. అంతే రెండో బంతికే ధోనీని ఔట్ చేసి ఆర్సీబీకి దయాల్ బ్రేక్ ఇచ్చాడు. ఈ తర్వాత కూడా దయాల్ పర్ఫెక్ట్​ స్లోబాల్స్​ వేశాడు. చివరి నాలుగు బంతుల్లో కేవలం 1 పరుగే ఇచ్చాడు.

నన్ను తొలి రోజు నుంచే నమ్మింది
మ్యాచ్ అనంతరం యశ్ సోషల్ మాట్లాడాడు. 'ఈ సీజన్​లో తొలి రోజు యాజమాన్యం నన్ను ఎంతగానో నమ్మింది. జట్టులో నేను ఓ కీలక ప్లేయర్ అని అభిప్రాయపడింది. నన్ను చాలా ప్రోత్సహించింది. ఆ సపోర్ట్ ఈరోజు ఈ ఫలితానికి కారణం' అని యశ్ అన్నాడు. గతేడాది రింకూ సింగ్​కు 5 సిక్స్​లు ఇచ్చిన తర్వాత యశ్ సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ యశ్ దయాల్​పై నమ్మకం ఉంచిన ఆర్సీబీ వేలంలో అతడిని రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అత్యంత కీలకమైన సందర్భంలో జట్టుకు విజయం అందించడం వల్ల యశ్​పై ప్రశంసలు కురుస్తున్నాయి.

యశ్​కు అంకితం: ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఆఖరి ఓవర్లో సంచలన బౌలింగ్ చేసిన యశ్​కు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు చెప్పాడు.

ఉత్కంఠ పోరులో సీఎస్కేకు షాక్​ - ప్లే ఆఫ్స్​కు ఆర్సీబీ - IPL 2024 CSK VS RCB

RCB ప్లేఆఫ్స్​ సెలబ్రేషన్స్- ప్లేయర్ల కంటే ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్- నెట్టింట ట్రెండింగ్! - IPL 2024

Last Updated : May 19, 2024, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.