ETV Bharat / sports

'ఏంటి జడ్డూ ఇలా చేశావ్​' - ధోనీ ఫ్యాన్స్​ను  ఆటపట్టించిన ఆల్​రౌండర్! - Ravindra Jadeja CSK - RAVINDRA JADEJA CSK

Ravindra Jadeja CSK : చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా చేసిన ఓ పని ధోనీ ఫ్యాన్స్​ను షాక్​కు గురి చేసేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Ravindra Jadeja CSK
Ravindra Jadeja CSK
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 10:15 AM IST

Updated : Apr 9, 2024, 12:16 PM IST

Ravindra Jadeja CSK : టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బౌలింగ్​ స్కిల్స్​తో వరుస వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ స్టార్​, బ్యాటింగ్​లోనూ అదరగొడుతుంటారు. క్రీజులోకి వచ్చాడంటే ఇక బౌండరీలు బాదుతూ చెలరేగిపోతుంటాడు. తాజాగా చేపక్ స్టేడియం వేదికగా కోల్​కతాతో జరిగిన పోరులోనూ తన సత్తా చాటాడు. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుని చెన్నై గెలుపులో కీలకమయ్యాడు.

అయితే ఈ స్టార్ క్రికెటర్ ఈ మ్యాచ్​లో చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అతడు చేసిన అల్లరి గురించి అభిమానులు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. మమల్ని ప్రాంక్​ చేశావ్ కదా గురు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతున్న సమయంలో నాలుగో స్థానంలో వచ్చిన శివవ్ దుబె ఔటయ్యాడు. అయితే అందరి దృష్టి డగౌట్​ పై పడింది. తమ ఫేవరట్ స్టార్​ ధోనీ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చే మూమెంట్​ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో స్టేడియంలోని అందరూ ధోనీ ధోనీ అంటూ అరవడం మొదలెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బ్యాట్​ పట్టుకుని జడేజా బయటకి వచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

'ఏంటి ధోని బ్యాటింగ్​కు రావట్లేదా' అంటూ ఆలోచించసాగారు. అయితే బయటకి వచ్చినట్లే వచ్చి నవ్వుకుంటూ జడ్డూ మళ్లీ డగౌట్​లోకి వెళ్లిపోయాడు. దీంతో అతడు అందరిని ఆటపట్టించాడన్న విషయాన్ని అర్థం చేసుకున్న అభిమానులు నవ్వుకున్నారు.

అయితే జడేకూ ఇలా ప్రాంక్ చేయమంటూ ధోనీనే స్వయంగా చెప్పాడట. తాను బ్యాటింగ్​కు రెడీగా ఉన్న సమంలో జడ్డూని ఊరికే అలా వెళ్లి ఫ్యాన్స్​కు షాక్ ఇవ్వు అంటూ ధోనీ చెప్పినట్లు చెన్నై జట్టు ప్లేయర్ తుషార్ దేశ్​పాండే చెప్పుకొచ్చాడు. ఇది విన్న ఫ్యాన్స్​ ధోనీ అల్లరి పనులకు నవ్వుకుంటున్నారు. అతడు ఇంకా మారలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ధోనీలో ఈ యాంగిల్ చాలా బాగుంటుందంటూ మురిసిపోతున్నారు. ఫ్యాన్స్​ను హ్యాపీగా ఉంచేందుకు ధోనీ ఇలాంటి పనులు చాలానే చేస్తారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హాఫ్​ సెంచరీతో రుతురాజ్ - ఐదేళ్ల తర్వాత చెన్నై కెప్టెన్ అరుదైన ఘనత - Ruturaj Gaikwad CSK

ముంబయి విజయం - 18 వేల మంది చిన్నారులతో నీతా అంబానీ సందడి - IPL 2024 DC VS Mumbai Indians

Last Updated : Apr 9, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.