Ravichandran Ashwin Wife: టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాజ్‌కోట్ టెస్టు మధ్యలో ఇంటికి వెళ్లడంపై అతడి భార్య ప్రీతి నారాయణ్ తాజాగా వివరణ ఇచ్చారు. అతడి తల్లి అనారోగ్యం కారణంగా అశ్విన్ టెస్టు మధ్యలో రావాల్సి వచ్చిందని ప్రీతి అన్నారు. ఆరోజు ఏం జరిగిందో ఆమె వివరించారు.
'ఆరోజు రాజ్‌కోట్ టెస్టు జరుగుతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన 5 నిమిషాలకే అశ్విన్ 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. అందరూ మాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అప్పుడే మా అత్తయ్య బిగ్గరగా అరస్తూ కుప్పకూలారు. అత్తయ్యను వెంటనే మేం హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అశ్విన్‌కు ఈ మ్యాటర్ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజ్‌కోట్- చెన్నై మధ్యలో విమాన సర్వీసులు సరిగ్గా లేవని నాకు తెలుసు' అని ప్రీతి అన్నారు.
'వెంటనే ఛెతేశ్వర్ పుజారాకు కాల్ చేశా. పుజారా ఫ్యామిలీ మాకు హెల్ప్ చేసింది. స్కానింగ్స్ పరిశీలించిన తర్వాత అత్తయ్య దగ్గర కుమారుడు (అశ్విన్) ఉంటే బాగుంటుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు అశ్విన్‌కు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పాను. దాంతో అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ 20- 25 నిమిషాల్లో తిరిగి ఫోన్ చేశాడు. అతడు రిటర్న్ రావడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సహకరించారు. అశ్విన్ ఇక్కడకు వచ్చేంతవరకు రోహిత్, రాహుల్ భాయ్ పరిస్థితి గురించి ఫాలోఅప్ చేశారు. అతడు అర్ధరాత్రి చెన్నై చేరుకున్నాడు' అని ఆ రోజు పరిస్థితిని ప్రీతి వివరించారు.
'అశ్విన్ హాస్పిటల్‌కు చేరుకొని ఐసీయూలో ఉన్న తల్లిని చూసి ఎమోషనలయ్యాడు. ఆమె కోలుకున్న తర్వాత మళ్లీ జట్టుతో చేరాలని మేమంతా అశ్విన్‌ను కోరాం. మ్యాచ్ మధ్యలో వదలి వెళ్లడం అశ్విన్ వ్యక్తిత్వం కాదు. టీమ్‌ను గెలిపించకపోతే చాలా ఫీలవుతాడు' అని ప్రీతి అన్నారు. ఇక అశ్విన్ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆఖరి టెస్టుతో 100వ మ్యాచ్ ఆడనున్నాడు.
5వ టెస్టుకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ , కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.
100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!