ETV Bharat / sports

రంజీ ఛాంపియన్​గా​ 'హైదరాబాద్'- ప్లేయర్లకు భారీ ప్రైజ్​మనీ- BMW కార్ కూడా! - Hyderabad Ranji Trophy Group

Ranji Trophy 2024 Hyderabad Final: 2024 రంజీ ప్లేట్ గ్రూప్ ఫైనల్​లో హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో జట్టు ప్లేయర్లపై హెచ్​సీఏ అధ్యక్షుడు వరాల జల్లు కురిపించారు.

Ranji Trophy 2024 Hyderabad Final
Ranji Trophy 2024 Hyderabad Final
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 8:23 PM IST

Updated : Feb 20, 2024, 8:50 PM IST

Ranji Trophy 2024 Hyderabad Final: 2024 రంజీ ట్రోఫీలో హైదరాబాద్​ జట్టు ప్లేట్​ గ్రూప్​ ఛాంపియన్​గా నిలిచింది. మేఘాలయాతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మేఘాలయా నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ నాలుగో రోజు తొలి సెషన్​లోనే ఛేదించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కే నితీశ్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ప్లేట్​ గ్రూప్​లో ఫైనల్​ చేరడం వల్ల హైదరాబాద్- మేఘాలయా జట్లు వచ్చే ఏడాది రంజీలో ఎలైట్ గ్రూప్​నకు అర్హత సాధించాయి.

వరాల జల్లు: ప్లేట్ గ్రూప్​ విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్‌ జట్టుకు రూ.10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు స్పెషల్ ప్రైజ్​మనీ కింద జగన్‌మోహన్‌ రావు ప్రకటించారు.

రూ.కోటి, BMW కారు: ఇక వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ ఎలైట్ (Elite) గ్రూప్​నకు హైదరాబాద్ క్వాలిఫై కావడంపై జగన్‌మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే 2- 3 ఏళ్లలో హైదరాబాద్​ రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ.కోటి ఇస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రావు, ప్లేయర్లకు అదనంగా ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామన్నారు. జట్టుకు అన్ని విధాలుగా HCA సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఆటగాళ్లకు ప్రైజ్​మనీ, బహుమతులు ఇస్తానని హెచ్​సీఏ ప్రెసిడెంట్ ప్రకటించడం సంతోషంగా ఉందని హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ తిలక్‌ వర్మ అన్నాడు. 'వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఆటే ప్రధానం. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసమే పోరాడుతాం. గెలుపు తప్ప మాకు మరో ధ్యాస ఉండుదు. రానున్న రెండు సీజన్లలో హైదరాబాద్‌ను రంజీ ట్రోఫీ విజేతగా నిలుపటమే మా లక్ష్యం. ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి, కార్లు అందిస్తామని ప్రకటించటం బాగుంది. ఇది మరింత ఉత్సాహం ఇస్తుంది' అని తిలక్‌ వర్మ అన్నాడు.

ఇరు జట్ల స్కోర్లు

  • మేఘాలయా: తొలి ఇన్నింగ్స్- 304/10; రెండో ఇన్నింగ్స్​- 234/10
  • హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్- 350/10; రెండో ఇన్నింగ్స్​- 203/5

రంజీ ట్రోఫీలో రికార్డ్​ ఛేజింగ్​ - 90 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

రంజీ వేదికగా రికార్డు - అరుదైన మైల్​స్టోన్​ను దాటిన పుజారా

Last Updated : Feb 20, 2024, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.