ETV Bharat / sports

మళ్లీ రాజస్థాన్ గూటికి చేరిన రాహుల్ ద్రావిడ్ - కీలక బాధ్యతలు చేతిలో! - Rahul Dravid Rajasthan Royals - RAHUL DRAVID RAJASTHAN ROYALS

Rahul Dravid Rajasthan Royals : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

RAHUL DRAVID
RAHUL DRAVID (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 6, 2024, 7:02 PM IST

Rahul Dravid Rajasthan Royals : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ప్రముఖ ఐపీఎల్ టీమ్‌ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. అంతేకాకుండా ఆయనకు రాజస్థాన్‌ జట్టుకు సంబంధించిన స్పెషల్ జెర్సీ ఇచ్చి సత్కరించింది. ఇక టీమ్‌ ఓవరాల్‌ స్ట్రాటజీపై మార్గనిర్దేశం చేసేందుకు ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కరతో కలిసి ద్రవిడ్ వెంటనే పనిచేయడం ప్రారంభిస్తారని ప్రకటించింది. దీంతో రాజస్థాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగొచ్చిన ద్రవిడ్
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ద్రవిడ్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది. 2011 నుంచి 2015 వరకు ఫ్రాంచైజీతో గడిపారు. 2012-13 మధ్య రెండేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగారు. రిటైర్‌ అయ్యాక రెండేళ్లపాటు రాజస్థాన్‌కు మెంటార్‌గానూ సేవలు అందించారు.

విజయవంతమైన కోచింగ్ కెరీర్
ద్రవిడ్‌ హయాంలో టీమ్‌ ఇండియా చాలా ఐసీసీ ట్రోఫీలకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఎట్టకేలకు ద్రవిడ్‌ చివరి అవకాశంలో ఇండియా 2024 టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ద్రవిడ్ భారత జట్టును రెండో T20 ప్రపంచ కప్ అందించాడు. ఘనంగా వీడ్కోలు తీసుకున్నారు. ద్రవిడ్‌ ఇండియా U-19 జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అధిపతిగా వ్యవహరించారు.

ఉత్సాహంగా రాజస్థాన్‌ రాయల్స్‌
రాజస్థాన్‌ రాయల్స్‌ సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్, ద్రవిడ్ తిరిగి రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీతో అతడికి ఉన్న సంబంధాన్ని, టీమ్‌ని మార్చగల సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్, వేలం వంటి కీలక ఈవెంట్‌లకు సిద్ధమయ్యేందుకు ద్రవిడ్ ఇప్పటికే సంగక్కరతో పాటు జట్టులోని మిగిలిన వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడని పేర్కొన్నాడు.

ఇక రాజస్థాన్ రాయల్స్ ప్రధాన యజమాని మనోజ్ బడాలే, ద్రవిడ్ పునరాగమనాన్ని స్వాగతించారు. ఇది జట్టు వృద్ధిని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నారు. కుమార్ సంగక్కర కూడా ద్రవిడ్‌ కోచింగ్ నైపుణ్యాలను తాజాగా ప్రశంసించారు.

అప్పుడు అన్​సోల్డ్- ఇప్పుడు స్పెషలిస్ట్​ బౌలర్- సందీప్ జర్నీ - IPL 2024

సంజూ శాంసన్ చారులత లవ్ జర్నీ - అలా వీరిద్దరు ఒక్కటయ్యారు! - Sanju Samson Love story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.