Rishabh Pant T20 World Cup: టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఎమోషనలయ్యాడు. దాదాపు 16నెలల తర్వాత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ ఈ టోర్నీలో మంచి కమ్‌బ్యాక్‌తో ఆకట్టుకున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన పంత్ రీ ఎంట్రీ తొలి టోర్నీలోనే ఛాంపియన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పంత్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. 'ఇదంతా దేవుడి ప్లాన్' అని వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
సర్జరీ తర్వాత కోలుకుంటున్నప్పటి నుంచి జాతీయ జట్టులోకి ఎంట్రీతో వరల్డ్‌కప్ నెగ్గిన మూమెంట్ దాకా సన్నివేశాలు ఆ వీడియోలో ఉన్నాయి. యాక్సిడెంట్ నుంచి వరల్డ్‌కప్ విజేతగా నిలవడం దాకా అతడి కమ్‌బ్యాక్ స్ఫూర్తి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'పంత్ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్', 'గ్రేటెస్ట్ కమ్‌బ్యాట్' 'నిజంగానే ఇదంతా దేవుడి స్క్రిప్ట్' అంటూ నెటిజన్లు పంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అయితే కొన్ని నెలల కిందట కర్ర సాయంతో నడిచిన పంత్, నిరంతరం శ్రమించి తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. పొట్టికప్ టోర్నీలో టీమ్ఇండియాకు సమర్థంగా వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలు క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్లు చేసి జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. అటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 171 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఫైనల్లో డకౌటై నిరాశ పర్చినా, కీపింగ్‌తో ఫర్వాలేదనిపించాడు.
Blessed, Humbled & Grateful. 🏆
— Rishabh Pant (@RishabhPant17) July 2, 2024
God has its own plan 🔥😇#RP17 pic.twitter.com/6JnKQ2V9LT
ఐపీఎల్‌తో సెలక్టర్ల దృష్టిలోకి
అయితే గతేడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైన పంత్ 2024 ఎడిషన్‌లో ఆడాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన పంత్ బ్యాట్‌తో అదరగొట్టాడు. 13మ్యాచ్‌ల్లో 35.31 సగటుతో 446 పరుగులతో రాణించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చినా, యాక్సిడెంట్ ప్రభావం ఎక్కడా కనిపించకుండా పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో సెలక్టర్ల దృష్టిలో పడిన పంత్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
This medal 🥇 hits you differently 🇮🇳🇮🇳😇 pic.twitter.com/V9p2frmO8N
— Rishabh Pant (@RishabhPant17) July 3, 2024
టీ20కు రిటైర్మెంట్ - మరి కోహ్లీ, రోహిత్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? - Kohli Rohith T20 Retirement
కోహ్లీ,రోహిత్ - వీరిద్దరి స్థానాలను ఈ ఆరుగురిలో భర్తీ చేసేదెవరో? - Kohli Rohit T20 Retirement