Pathum Nissanka ODI : శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. తాజాగా అప్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో మెరుపు ద్విశతకంతో చెలరేగిపోయాడు. 136 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
మరోవైపు ఈ లిస్ట్‌లో ఇప్పటికే వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ (138 బంతుల్లో), టీమ్ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతుల్లో) ఉండగా, ఇప్పుడు ఈ ఇద్దరి రికార్డులను నిస్స్ంక బ్రేక్ చేశాడు. అయితే వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇక ఈ లిస్ట్‌లో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128) నమోదు చేశాడు.
ఈ డబుల్ సెంచరీతో నిస్సంక పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో డబుల్ నమోదు చేసిన తొలి శ్రీలంక ప్లేయర్‌గా, అంతే కాకుండా ఓవరాల్‌గా 12వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత శర్మ, మార్టిన్ గప్తిల్, సెమ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మ్యాక్స్‌వెల్, సచిన్ తెందూల్కర్ వన్డేల్లో డబుల్ మార్కును దాటారు. వీరిలో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు వన్డే డబుల్‌లు సాధించాడు.
-
Pathum Nissanka becomes the first-ever Sri Lanka batter to score a Men's ODI double hundred 🎉#SLvAFG pic.twitter.com/1VxXk664SQ
— ICC (@ICC) February 9, 2024
ఇక మ్యాచ్ విషయానికొ వస్తే - మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు, నిస్సంక డబుల్ సెంచరీ వల్ల భారీ స్కోర్‌ను సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు తన ఖాతాలో వేసుకుంది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు.
Dunith Wellalage Asia Cup 2023 : భారత్‌ను హడలెత్తించిన కుర్ర స్పిన్నర్.. అసలెవరీ దునిత్ ?
ప్రాక్టీస్‌కు వెళ్లలేకపోతున్నా.. భారత్ మాకు చాలా సాయం చేసింది: లంక క్రికెటర్ భావోద్వేగం