Paris Olympics 2024 : ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్ - వూ ఇక్పై ఓడిపోయింది. తర్వాత రౌండ్లో ఈ మలేషియా ద్వయం చైనాకు చెందిన లియాంగ్ - వాంగ్ చాంగ్తో తలపడనుంది.
Sathwik Chirag _ వాస్తవానికి తొలి గేమ్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం ఆధిపత్యాన్ని చూపించింది. తొలి గేమ్‌ను దక్కించుకుంది. కానీ రెండో గేమ్‌లో మాత్రం మలేసియా జోడీ అద్భుతంగా రాణించింది.స ఓ దశలో 4-0తో వెనకబడిన ఆరోన్- సో వూయి ద్వయం అనంతరం వేగంగా పుంజుకుంది. అలా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో గేమ్‌లో 2-5 తేడాతో వెనకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5తో, 16-16తో స్కోర్లు సమం చేసింది కానీ ఆ తర్వాత తేలిపోయింది.
లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు - 22 ఏళ్ల లక్ష్య సేన్ కార్వర్ ఫైనల్స్‌కు(Lakshya Sen) అర్హత సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఈవెంట్లో స్టైట్ గేమ్స్‌లో హెస్ ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-12, 21-6 తేడాతో ఓడించాడు.
#Badminton Men's Doubles Quarterfinals
— SAI Media (@Media_SAI) August 1, 2024
Satwik and Chirag put up a valiant effort before they went down 1-2 to the World No. 5 Malaysian pair of Chia and Soh.
With this, the pair's campaign at the #Paris2024Olympics comes to an end.
Continue cheering for our athletes and… pic.twitter.com/S3IQ434Yf0
ముగిసిన ఆర్చర్ల పోరాటం - పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఓటమిని అందుకున్నాడు. 0-6 తేడాతో వెంచావో (చైనా) గెలుపొందాడు.
అథ్లెటిక్స్ నడకలో - అథ్లెటిక్స్ మెన్స్ 20 కి.మీ. నడకలో భారత అథ్లెట్లు వికాస్ సింగ్ 30వ స్థానం (1:22:36 నిమిషాలు), పరమ్‌జీత్ 37వ స్థానం (1:22:48 నిమిషాలు), ఆకాశ్‌దీప్ 50వ స్థానంలో నిలిచారు. ఉమెన్స్ 20 కి.మీ. నడకలో ప్రియాంక 41వ స్థానంలో( 1:39:55 నిమిషాలు) నిలిచింది.
రైఫిల్‌లో నిరాశ - ఉమెన్స్ 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. అంజుమ్(584 పాయింట్లతో) 18వ స్థానంలో, సిఫ్త్ కౌర్(575 పాయింట్లతో) 31వ స్థానంలో నిలిచారు. అంజుమ్ మోకాళ్లపై కూర్చుని 196 పాయింట్లు (97,99), బోర్లా పడుకుని 194 పాయింట్లు (97, 97), నిలబడి 194 పాయింట్లు (97, 97) సాధించింది. సిఫ్త్ కౌర్ మోకాళ్లపై కూర్చుని 193 పాయింట్లు (96, 97), మోకాళ్లపై కూర్చుని 195 పాయింట్లు (99,96), నిలబడి 187 పాయింట్లు (93, 94) సాధించింది.
బాక్సింగ్‌లో నిఖత్‌కు షాక్ - గోల్డ్ మెడల్‌పై గురిపెట్టిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు(Nikhat Zareena olympics) షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో నిఖత్‌పై 0-5 తేడాతో వు హు (చైనా) గెలుపొందింది.
ఇక భారత పురుషుల హాకీ జట్టు తొలి ఓటమిని అందుకుంది. పూల్ బిలో బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో భారత్ పరాజయం పొందింది.
'ప్లీజ్ తినడానికి ఏమైనా ఇవ్వండి' - భారత ఒలింపిక్ విన్నర్ సరబ్ జోత్ - Paris Olympics 2024