Paris Olympics 2024 Shooting : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్, సరబ్ జోత్ సింగ్ అరదగొట్టారు. సౌత్‌కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించారు. స్వాతంత్య్రం తర్వాత ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ చరిత్రకెక్కింది.
INDIA WIN BRONZE MEDAL 🥉
— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024
Manu Bhaker and Sarabjot Singh defeated the Korean duo 16-10 in the 10m Air Pistol Mixed Team event, securing India's second medal in Paris.
WELL DONE CHAMPIONS 🔥🔥#Shooting #ManuBhaker #SarabjotSingh #ParisOlympics2024 #Paris2024 #paris2024olympics… pic.twitter.com/WDyWsGHYCh
భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని మను బాకర్ అందించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌత్‌కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజత పతకాన్ని సాధించారు.
'షూటర్లు మరోసారి మనల్ని గర్వించేలా చేశారు'
భారత్‌కు మరో పతాకాన్ని అందించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. "షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు! ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మనుబాకర్ అలాగే సరబ్ జోత్ సింగ్‌లకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యంతో పాటు జట్టు కృషిని ప్రదర్శించారు. భారత ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మనుకి ఇది వరుసగా రెండవ ఒలింపిక్ పతకం. ఆమె స్థిరమైన నైపుణ్యంతో పాటు ఆమె అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది." అంటూ మోదీ ట్వీట్ చేశారు.
Our shooters continue to make us proud!
— Narendra Modi (@narendramodi) July 30, 2024
Congratulations to @realmanubhaker and Sarabjot Singh for winning the Bronze medal in the 10m Air Pistol Mixed Team event at the #Olympics. Both of them have shown great skills and teamwork. India is incredibly delighted.
For Manu, this… pic.twitter.com/loUsQjnLbN
ఇక మను బాకర్ ఈ రేర్ రికార్డు సొంతం చేసుకోవడం పట్ల క్రీడాభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి రామకృష్ణ బాకర్ కుమార్తె విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. "నేను కూడా మీ లాగే ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది భారతీయులకు ఓ శుభవార్త. నా కుమార్తెపై మీరు చూపించిన ప్రేమాభిమానులకు నేును ఎంతో కృతజ్ఞుడను" అంటూ రామకృష్ణ బాకర్ పేర్కొన్నారు.
#WATCH | Shooter Manu Bhaker wins bronze medal in 10m Air Pistol Mixed team event in Paris Olympics 2024
— ANI (@ANI) July 30, 2024
Her father Ramkrishna Bhaker says, " i am very happy. this is big news for the whole country. i thank the countrymen for giving their love and blessings to manu and also… pic.twitter.com/AE8vDjEiyh
మరోవైపు సరబ్‌జోత్ సింగ్ కుటుంబం కూడా విజయానందంతో సంబరాలు చేసుకుంటోంది. తాజాగా సరబ్‌జోత్ తండ్రి జితేందర్ సింగ్ కూడా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "మను బాకర్‌తో పాటు నా కుమారుడు కాంస్య పతక గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుతో పాటు ఆమె కుటుంబానికి నా శుభాకాంక్షలు. నేను గురుద్వారాకు వెళ్లి దేవుడికి ప్రార్థించుకుని వస్తాను. మా ఊర్లో ఇక సంబరాలు జరుగుతాయి." అంటూ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.
#WATCH | Ambala, Haryana: At #ParisOlympics2024, shooters Manu Bhaker and Sarabjot Singh bring India its second medal as they win Bronze in 10m Air Pistol Mixed team event.
— ANI (@ANI) July 30, 2024
Sarabjot Singh's father, Jitender Singh says, " ...manu bhaker and my son have won bronze. heartiest… pic.twitter.com/kQgKLbS1GS
12ఏళ్ల నిరీక్షణకు తెర- తొలి మహిళగా మను రికార్డు- ముర్ము, మోదీ హర్షం - Olympics 2024
మను బాకర్‌కు అరుదైన గౌరవం - ఆ సింబల్‌కు అర్థం ఏంటంటే? - Manu Bhaker Eiffel Tower Badge