Paris Olympics Silver Medal Neeraj Chopra Brand Value : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడి ఇండియా గోల్డెన్ బాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్న నీరజ్ రెండోసారి బంగారు పతకాన్ని మిస్ చేశాడు. అయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో రజతం గెలిచాడు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు గెలిచిన మొదటి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. ఈ విజయంతో నీరజ్ బ్రాండ్ వ్యాల్యూ గణనీయంగా పెరిగింది. బడా కంపెనీలు అతనితో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ లిస్టులో ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి.
స్థిరంగా రాణిస్తున్న ఛాంపియన్ - నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఏ మాత్రం పక్కదారి పట్టకుండా స్థిరంగా రాణిస్తూ ముందుకెళ్లాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ వంటి ప్రధాన ఈవెంట్‌లలోనూ విజేతగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో అతడు వీసా, శామ్‌సంగ్, ఒమేగా, అండర్ ఆర్మర్, కోకాకోలా, బ్రిటానియా, భారత్ పెట్రోలియం వంటి పెద్ద బ్రాండ్‌లకు టాప్ అంబాసిడర్‌గా ఎదిగాడు.
పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ - ఇక పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయం అతని కమర్షియల్ బ్రాండ్ వ్యాల్యూని 40-50% పెంచిందని తెలిసింది. ఆటోమొబైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, క్విక్ కామెర్స్ రంగంలోని కంపెనీలు నీరజ్‌తో కలిసి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. JSW స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మాట్లాడుతూ - "నీరజ్ భారతదేశంలో అత్యుత్తమ అథ్లెట్. అతడు దేశానికి వరుసగా ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజత పతకాలు అందించాడు. ఇతర ప్రధాన ప్రపంచ ఈవెంట్‌లలో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. నీరజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణ, గుర్తింపు లభించాయి. దీంతో అతడి బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగింది." అని పేర్కొన్నాడు.
కంపెనీలకు ఉత్తమ అవకాశం - పారిస్ ఒలింపిక్స్‌కు ముందే నీరజ్ ఎండార్స్‌మెంట్ ఫీజు ఎక్కువగా ఉంది. ఇటీవల రజత పతకం గెలవడంతో ఆ వ్యాల్యూ మరింత పెరిగింది. యాదవ్ మాట్లాడుతూ - "పారిస్‌లో రజతం సాధించడంతో నీరజ్ భారతదేశపు గొప్ప ఇండివిడ్యువల్ ఒలింపియన్‌గా మారాడు. అది అతని కమర్షియల్ వాల్యూను మరింత పెంచింది. మేము త్వరలో కొన్ని కీలక విభాగాల్లో డీల్స్ క్లోజ్ చేయాలని భావిస్తున్నాం." అని తెలిపాడు. కాగా, నీరజ్ చోప్రా అటు ఆన్ ఫీల్డ్‌లో ఇటు ఆఫ్ ఫీల్డ్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేంత సామర్థ్యం ఉంది. కాబట్టి నెక్ట్స్ 2028 లాస్ ఏంజెల్స్లోగా మరిన్ని కంపెనీలు అతడితో కలిసి పని చేసేందుకు ఇది ఉత్తమ అవకాశం అని విశ్లేషకులు అంటున్నారు.
SILVER MEDAL 🥈
— Team India (@WeAreTeamIndia) August 8, 2024
A seasons best, and a second Olympic Medal for @Neeraj_chopra1 . What an athlete 👏🏽👏🏽#JeetKiAur | #Cheer4Bharat pic.twitter.com/lUHMFaPfUK
షూటింగ్‌కు మను బాకర్ విరామం! - నెక్ట్స్ ఏం చేయబోతుందంటే? - Manu Bhaker Break from Shooting
మను బాకర్‌తో నీరజ్ చోప్రా పెళ్లి - స్పష్టత ఇచ్చిన షూటర్ తండ్రి - Manu bhaker Neeraj chopra Marriage