Paris Olympics 2024 Manu Bhaker Net worth : పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను బాకర్ పైనే ఇప్పుడందరీ దృష్టి ఉంది. వ్యక్తిగత విభాగంలో 10మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్, సరభ్ జోత్ సింగ్‌తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో మను దేశానికి పతకాలను అందించింది. దీంతో మను బాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆమె వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో మను బాకర్ ఆస్తి విలువ ఎంత? తదితర విషయాలను తెలుసుకుందాం.
రూ.12 కోట్లు ఆస్తి - 2024 నాటికి మను బాకర్ నెట్ వర్త్ రూ. 12 కోట్లు అని తెలిసింది. ఆమె ఈ సంపదను పెర్ ఫార్మాక్స్, నథింగ్ ఇండియా వంటి బ్రాండ్ల ప్రమోటింగ్, టోర్నమెంట్ల ద్వారా వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్లు, స్పాన్సర్ షిప్ ద్వారా సంపాదించినట్లు సమాచారం. అలాగే కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించినందుకుగానూ హరియాణా సర్కార్ మను బాకర్‌కు కొన్నాళ్ల క్రితం రూ.2 కోట్లు నగదును అందజేసింది. ఇలా అన్నీ కలిపి యువ షూటర్ మను బాకర్ ఆస్తి విలువ రూ.12 కోట్లకు చేరినట్లు తెలిసింది.
40 సంస్థలు ఆఫర్(Paris Olympics 2024 Manu Bhaker Brand Value) - సాధారణంగా దేశంలో మహిళా అథ్లెట్లు ఎండార్స్ మెంట్లు కోసం రూ.8 లక్షలు-30 లక్షల వరకు వసూలు చేస్తారు. అయితే పారిస్ ఒలింపిక్స్ ముందు వరకు మను కూడా ప్రతీ ఎండార్స్ మెంట్‌కు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ఆర్జించేదట. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం వల్ల మను బాకర్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా చేయాలంటూ ఇప్పటికే 40 సంస్థలు మనును సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఓఎస్ స్టోర్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సీఈవో, ఎండీ నీరవ్ తోమర్ తెలిపారు.
ఆరు రెట్లు పెరిగిన బ్రాండ్ వాల్యూ - పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తర్వాత మను బాకర్ బ్రాండ్ విలువ దాదాపు ఆరు రెట్లు పెరిగింది. అంటే రూ.25 లక్షల నుంచి రూ. కోటిన్నరకు పెరిగిందన్నమాట. కాగా, గతంలో మను బాకర్ ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లోనూ పతకాలను గెలిచింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లోనూ రెండు మెడల్స్ సాధించింది.
భారత ఒలింపిక్స్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఇదే - మను బాకర్‌కు ఎంత ఇస్తారంటే? - Paris Olympics 2024