Paris Olympics 2024 Indian athletes wears traditional dresses : ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌లోని నదిలో ఆరంభ వేడుకలు నిర్వహించారు. సెన్ నది వేదికగా 6 కి.మీ పొడవునా దాదాపు 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో మొత్తం 3 వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
Paris Olympics 2024 Opening Ceremony : అయితే ఈ విశ్వక్రీడల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అలానే ఈ ఒలింపిక్స్ పోటీలను భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు రంగంలోకి దిగి తమ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
అలానే ఈ వేడుకల్లో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. భారత పురుష అథ్లెట్లు కుర్తా బుండీ ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మహిళా అథ్లెట్లు చీర ధరించారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈమె ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా ఉంది. మొత్తంగా ఈ సంప్రదాయ దుస్తుల్లోనే ఓపెనింగ్ సెర్మనీలో వీరంతా మార్చ్ చేశారు. భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకం రంగులు ఈ దుస్తులపై ఉండటం విశేషం. కాగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన అథ్లెట్లను ప్రోత్సహించండి అంటూ కోరింది.
And, we’re all set for the Opening Ceremony! Tune in for a unique Ceremony, a first for the Summer Olympics where the ceremony will be held outside a stadium! The parade of athletes will be held on river Seine!
— Team India (@WeAreTeamIndia) July 26, 2024
Let’s cheer loud for our athletes! Chalo #JeetKiAur#Cheer4Bharat pic.twitter.com/KQjzd4axvF
ఓపెనింగ్ సెరిమనీలో భాగంగా జరిగిన పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. వీళ్ల వెనకాల మన అథ్లెట్లతో పడవ సాగిపోయింది. అయితే శనివారం (జులై 27) రేస్ ఉండటం వల్ల రోయర్ బాల్‌రాజ్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కారణంగా భారత హాకీ ఆటగాళ్లలో ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లు మాత్రమే ఈ సంబరాల్లో పాల్గొన్నారు. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ అథ్లెట్లు కూడా ఇంకా పారిస్ చేరుకోలేదు.
President IOA @PTUshaOfficial visited the Athletes Village yesterday. She met with Chef de Mission @gaGunNarang and Deputy Chef de Mission @100thofasec, as well as athletes. She wished everyone well, whilst checking on the preparations there! #JeetKiAur #Cheer4Bharat pic.twitter.com/cJWJDolSxM
— Team India (@WeAreTeamIndia) July 26, 2024
వేర్వేరు క్రీడలు - ఒకటే లక్ష్యం - ఆఖరి పోరులో ముగ్గురూ పసిడి కొడుతారా? - Paris Olympics 2024