ETV Bharat / sports

వరుసగా 6 గోల్డ్​ మెడల్స్​ - ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీ జట్టు సాధించిన ఘనతలు ఇవే - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Olympics Hockey India Medals : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత హాకీ జట్టు పారిస్‌ ఒలింపిక్స్​లోనూ అద్భుత ప్రదర్శనతో మరోసారి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​ చరిత్రలో ఇప్పటివరకు భారత హాకీ జట్టు సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

source Associated Press
Olympics Hockey India Medals (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 9, 2024, 7:22 AM IST

Olympics Hockey India Medals : ఒకప్పుడు ఒలింపిక్స్‌లో తిరుగులేని విజయాలతో చరిత్ర సృష్టించింది భారత హాకీ జట్టు. కానీ ఆ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయి ఆ జట్టుకు మళ్లీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్న భారత హాకీ జట్టు పారిస్‌ విశ్వ క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి మరోసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అలా మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు పూర్వ వైభవాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది.

మోడ్రన్​ ఒలింపిక్స్‌ ప్రారంభమైన తర్వాత 1928 అమ్‌స్టర్‌డమ్‌ ఒలింపిక్స్‌లో తొలి సారి గోల్డ్ మెడల్ సాధించింది భారత హాకీ జట్టు. ఆ తర్వాత నుంచి తన జైత్ర యాత్రను అలాగే కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లింది. లాస్​ ఏంజెల్స్‌ (1932), బెర్లిన్ (1936), లండన్ (1948), హీల్‌ సింకీ (1952), మెల్‌ బోర్న్‌ (1956) ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్స్​ వరుసగా సాధించి చరిత్ర సృష్టించింది. అనంతరం రోమ్‌ (1960)లో రజతం, టోక్యోలో (1964) మళ్లీ గోల్డ్​ మెడల్​ను దక్కించుకుంది. మెక్సికో సిటీ (1968), మ్యూనిక్​లో (1972) కాంస్య పతకంతో సరి పెట్టుకుంది.

ఇక చివరి సారిగా మాస్కో (1980) ఒలింపిక్స్‌లో గోల్డ్​ మెడల్​ సాధించింది భారత్. అనంతరం హాకీలో భారత్‌ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలా నాలుగు దశాబ్దాల పాటు పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ టోక్యోలో(2021) అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని భారత హాకీకి మళ్లీ ఊపిరి పోసేలా చేసింది. ఇక తాజా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ దూకుడు ప్రదర్శన చేసింది. కానీ సెమీ ఫైనల్​లో బోల్తా పడింది. అయినా కూడా పట్టు వీడకుండా చివరకు మరోసారి కాంస్య పతకం సాధించి హాకీ ఫ్యాన్స్​లో సంతోషాన్ని నింపింది మన హాకీ జట్టు.

బంగారుకొండకు వెండి దండ - నీరజ్ చోప్రా సెన్సేషనల్ రికార్డ్​ - PARIS OLYMPICS 2024

కాంస్య పతకంతో భారత హాకీ జట్టు గెలుపు సంబరాలు - మోదీ, ముర్ము అభినందనలు - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.