ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్​కు 117 మంది భారత అథ్లెట్లు - ఆమె మాత్రమే మిస్సింగ్ - Paris Olympics 2024

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా భారత అథ్లెట్ల అసోషియేషన్ తాజాగా 117 మంది ప్లేయర్ల పేర్లు గల ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో మాత్రం ఓ ప్లేయర్​ను మిస్ చేసింది. అసలేం జరిగిందంటే?

Paris Olympics 2024
Paris Olympics 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 11:20 AM IST

Paris Olympics 2024 : ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా భారత అథ్లెట్ల అసోషియేషన్ తాజాగా ఓ స్టేట్​మెంట్​ను విడుదల చేసింది. అందులో భారత తరఫున వివిధ క్రీడల్లో పాల్గొననున్న 117 మంది ప్లేయర్ల పేర్లు గల ఓ జాబితాను ప్రకటించింది. అయితే మొత్తం భార‌త బృందంలో 72 మందిని మాత్రమే ప్ర‌భుత్వం త‌న ఖ‌ర్చుల‌తో పంపించనున్నట్లు పేర్కొంది.

అందులో క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది వెళ్లనున్నట్లు పేర్కొంది. అయితే అందులో మాత్రం షాట్‌పుటర్ అభా ఖతువా పేరును మిస్ చేసింది. వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్ కోటా ద్వారా ఒలింపిక్స్​లో అర్హ‌త సాధించింది అభా ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించింది, కానీ వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ జాబితాలో ఆమె పేరు లేకపోవడం వల్ల భార‌త ఒలింపిక్ బృందం నుంచి ఈమె పేరును తొల‌గించారు.

భారత్​ నుంచి వెళ్లనున్న ప్లేయర్ల జాబితా ఇదే

అథ్లెటిక్స్ - 29 (11 మ‌హిళ‌లు, 18 పురుషులు )

షూటింగ్‌ - 21

హాకీ - 19

టేబుల్ టెన్నిస్‌ -8

బ్యాడ్మింట‌న్‌ -7

రెజ్లింగ్‌ 6

ఆర్చ‌రీ - 6

బాక్సింగ్‌ - 6

గోల్ఫ్ - 4

టెన్నిస్‌ - 3

స్విమ్మింగ్‌ -2

సెయిలింగ్‌ -2

ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు
ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. చంఢీగడ్​ యూనివర్సిటీకి ఈ అరుదైన అవకాశం లభించింది. అందులో అర్జున్‌ బబుటా(షూటింగ్‌), భజన్‌ కౌర్‌(ఆర్చరీ), రితిక హుడా (రెజ్లింగ్‌), సంజయ్‌ (హాకీ), అక్ష్‌దీప్‌ సింగ్‌ (రేస్‌ వాకింగ్‌), యశ్‌ (కయాకింగ్‌)లతో పాటు పారాలింపియన్లు పలక్‌ కోహ్లీ (బ్యాడ్మింటన్‌), అరుణ తన్వర్‌ (తైక్వాండో) చంఢీగడ్​కు చెందిన విద్యార్థులు. వీరంతా ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగుతున్నారు.

ఇక పారిస్ ఒలింపిక్స్‌లో 184 దేశాలు పాల్గొంటున్నాయి. సుమారు 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అమెరికా అత్యధికంగా 588 మంది అథ్లెట్లను పంపుతోంది. ఈ 184 దేశాల నుంచే కాకుండా రష్యా, బెలారస్ నుంచి 45 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఈ రెండు దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెండ్‌ చేయడం వల్ల వారు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడతారు.

పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్​గా గగన్ నారంగ్ - ఫ్లాగ్​ బేరర్​గా సింధు

184 దేశాలు, 10వేల అథ్లెట్లు, 329 పతకాలు- పారిస్ ఒలింపిక్స్ ఫుల్ డీటెయిల్స్ - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.