ETV Bharat / sports

మరో పతకానికి మను 'గురి'- బ్యాడ్మింటన్​లో మనోళ్ల రికార్డ్- డే 3 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Day 3 India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో మూడోరోజు కూడా భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. షూటర్లు కాస్త నిరాశ పర్చగా, బ్యాడ్మింటన్, హాకీలో మనోళ్లు అదరగొట్టారు. మరి విశ్వ క్రీడల్లో మూడో రోజు హైలైట్స్ ఎంటో చూసేయండి.​

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 10:55 PM IST

Paris Olympics 2024 Day 3 India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో మూడోరోజు కూడా భారత్​కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షూటింగ్ విభాగంలో 10మీటర్ల మిక్స్​డ్ డబుల్స్​ ఈవెంట్​లో మనూ బాకర్- సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ రాణించింది. క్వాలిఫికేషన్ రౌండ్​లో 3వ స్థానం దక్కించుకున్నారు. దీంతో కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. మంగళవారం (జులై 30) మధ్యాహ్నం 1.00 గంటలకు మను- సబర్​జోత్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఆడనున్నారు. ఇక మూడోరోజు ఎవరెవరు ఏయే ఈవెంట్లలో పాల్గొన్నారంటే?

ఫైనల్​లో నిరాశ
10మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల సింగిల్స్​ ఫైనల్ ఈవెంట్లో షూటర్ రమితా జిందాల్​కు నిరాశే ఎదురైంది. హోరాహోరీగా సాగిన పతక పోరులో జిందాల్ 7వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఇదే ఈవెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్​లో అర్జున్ బబుతాకు కూడా పరాభవం ఎదురైంది. చివరి దాకా గట్టి పోటీ ఇచ్చిన అర్జున్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఈవెంట్​లో అర్జున్ స్వల్ప తేడాతో 4వ స్థానానికే పరిమితమయ్యాడు. దీంతో పతకం ఆశలు ఆవిరయ్యాయి. లేదంటే ఈరోజే భారత్ ఖాతాలో మరో పతకం చేరేదే!

బ్యాడ్మింటన్​లో మిశ్రమ ఫలితాలు
భారత జోడీ అశ్విని పొన్నప్ప- తానిషా క్రాస్టో ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. సోమవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్​లో జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా- చిహారు షిదా చేతిలో ఓడారు. 21-11 21-12 పాయింట్ల తేడాతో భారత ద్వయం ఓటమిపాలైంది. దీంతో ఈ విభాగం నుంచి నిష్క్రమించారు.

సాత్విక్- చిరాగ్ అదుర్స్

భారత స్టార్ జోడీ సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ పారిస్ ఒలింపిక్స్​లో వాక్​ఓవర్​లో నెగ్గింది. ప్రత్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం వల్ల సాత్విక్- చిరాగ్ విజేతలుగా ఎంపికయ్యారు. దీంతో ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్​కు చేరుకుంది. కాగా, ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్ డబుల్స్​ విభాగంలో క్వార్టర్స్​కు చేరిన తొలి జోడీగా రికార్డు కొట్టింది. ఇక జూలై 30న ఇండోనేసియా జోడీతో భారత్ ద్వయం తలపడనుంది.

మరోవైపు లక్ష్యసేన్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో కరాగి (బెల్జియం)ని ఎదుర్కొన్న లక్ష్యసేన్ 21-19, 21-14తేడాతో నెగ్గాడు. ఇక జులై 31న జొనాథన్ (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.

హాకీ డ్రా
తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్​ను ఓడించిన భారక హాకీ జట్టు సోమవారం అర్జెంటీనాను ఎదుర్కొంది. ఈ మ్యాచ్​లో అర్జెంటీనా నుంచి గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​ను భారత్ 1-1తో డ్రా గా ముగించింది. ఇక మంగళవారం భారత్, ఐర్లాండ్​ను ఢీ కొట్టనుంది. ఆరు జట్లున్న పూల్​ బీలో టాప్-4లో నిలిచిన జట్లు క్వార్టర్స్​కు చేరుకుంటాయి.

ఆర్చరీలో నిరాశ
పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో భారత త్రయం నిరాశ పర్చింది. సోమవారం తుర్కియేతో జరిగిన క్వార్టర్ ఫైనల్​లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్​దీప్, ప్రవీణ్ త్రయం 2-6 తేడాతో ఓడింది.

కాంస్య పోరులో మను బాకర్‌ జోడీ - ఫైనల్‌లో రమితకు నిరాశ - Paris Olympics 2024 July 27 Events

ప్రొఫెషనల్‌ చెఫ్‌లు, అదిరిపోయే వంటకాలు - ఒలింపిక్స్‌ విలేజ్‌లో మన అథ్లెట్లు ఏం తింటున్నారంటే? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.