Paris Olympics 2024 Closing Ceremony : అద్భుత విన్యాసాలు, వాటితో పాటు అంతులేని భావోద్వేగాలు ఇలా పలు అంశాల సమ్మేలనంగా సాగిన 19 రోజుల విశ్వ క్రీడా వినోదానికి గ్రాండ్‌గా తెరపడనుంది. సెన్ నది వేదికగా ఈ నెల 26న అధికారికంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్, వివిధ పోటీల ద్వారా క్రీడాభిమానులను అలరించి నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 12.30 గంటలకు ఈ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరిమనీ జరగనుంది. ఇక ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, అలాగే హాకీ స్టార్ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించనున్నారు.
ఇక ఈ ముగింపు వేడుకకు స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదిక కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో పాప్ సింగర్, రైటర్ హెచ్.ఈ.ఆర్ పెర్ఫామనెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. వీటితో పాటు పలు డ్యాన్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
చివరి రోజు జరగనున్న పోటీలు :
ఒలింపిక్స్ చివరి రోజు బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, అథ్లెటిక్స్ (మహిళల మారథాన్), హ్యాండ్‌బాల్, మోడర్న్ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, రెజ్లింగ్,వెయిట్‌లిఫ్టింగ్‌లో పోటీలున్నాయి. అలా 14 పసిడి పతకాంశాలున్నాయి. బాస్కెట్‌బాల్ అమ్మాయిల ఫైనల్‌తో పోటీలు ముగుస్తాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పోరాటం :
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పోరాటం ఆరు పతకాలతో ముగిసింది. శనివారంతో క్రీడల్లో మన ఆటకు తెరపడింది. భారత్ చివరి ఆశ కిరణం రెజ్లర్ రీతిక హుడా క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడి ఓడింది. అంతకుముందు ఆమె 12-2తో బెర్నాడెట్ నగీని ఓడించి ఘనంగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రీతిక టెక్నికల్ సుపీరియారిటీతో పైచేయి సాధించింది.
అదిరే ఆటతో ఆశలు రేపిన రీతిక టాప్ సీడ్ ఐపెరి మెడెట్ కిజీతో క్వార్టర్స్‌లోనూ గట్టిగా పోరాడింది. బౌట్ ముగిసే సరికి ప్రత్యర్థితో సమంగా నిలిచింది. కానీ,.నిబంధనల ప్రకారం చివరగా పాయింట్ సాధించిన బెర్నాడెట్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు గోల్ఫ్‌లో కూడా భారత్‌కు నిరాశ తప్పలేదు. మహిళల గోల్ఫ్‌లో అదితి అశోక్, దీక్ష దాగర్ పతకం సాధించలేకపోయింది.
వినేశ్ పొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా - మళ్లీ ఎప్పుడంటే? - Paris Olympics 2024
10గంటల్లో 4.6కేజీలు తగ్గిన అమన్- లేకుంటే మళ్లీ అది రిపీట్ అయ్యేదే! - Paris Olympics