Paris 2024 Olympics: పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి. అక్కడ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ పారిస్‌కి దాదాపు 8,000 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఇప్పటికే సంబరాలు అంబరాన్నంటాయి. ఎందుకంటే, మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) రిటైల్ ఛానెల్స్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' అని లేబుల్ ఉన్న దుస్తులను చూస్తే, అది తిరుచ్చికి చెందిన దీపా జయన్, ఆమె కూతురు ఐశ్వర్య నిర్వహిస్తున్న సంస్థ నుంచి వచ్చింది కావచ్చు. వీరి యాజమాన్యంలోని టెక్స్‌టైల్ హబ్ 'బ్యాక్ బే ఇండియా' ద్వారా ఉత్పత్తి చేసినదే అయి ఉండవచ్చు.
బ్యాక్ బే ఇండియా
బ్యాక్ బే ఇండియా భారతదేశంలోని తిరుప్పూర్‌లో ఉన్న పాపులర్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది యూరప్, ఇతర పశ్చిమ దేశాలకు వివిధ రకాల దుస్తులు, గృహ వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. భారతదేశం 90% కాటన్ నిట్‌వేర్ ఎగుమతులు తిరుప్పూర్ నుంచే ఉంటాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన కార్మికులను తిరుప్పూర్ ప్రసిద్ధ.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాక్ బే ఇండియా తనదైన ముద్ర వేసింది. కంపెనీకి పారిస్‌లో ఒలింపిక్ వస్తువులను విక్రయించే దుకాణం ఉంటుంది. వారి ఉత్పత్తులు స్టేడియంలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 28న ప్రారంభమయ్యే పారాలింపిక్ క్రీడలకు సామగ్రిని కూడా అందజేస్తున్నారు. దీపా జయన్, ఆమె కుమార్తె ఐశ్వర్య శుక్రవారం వారి టెక్స్‌టైల్ టౌన్ కార్యాలయంలో పారిస్‌కు తమ చివరి కార్గో దుస్తులను పంపడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దాదాపు మిలియన్ పీస్‌లు రవాణా చేశారు.
ఒలింపిక్స్ భద్రతలో భారత్ కె9
పారిస్ ఒలింపిక్స్‌లో భద్రతకు భారత్ కూడా తన కె9 బృందంతో సహకరిస్తోంది. భారతీయ K9 బృందంలో వివిధ జాతులకు చెందిన 10 కుక్కలు ఉన్నాయి. ఇందులో ఆరు బెల్జియన్ షెపర్డ్‌లు, మూడు జర్మన్ షెపర్డ్‌లు, ఒకటి లాబ్రడార్ రిట్రీవర్. ఈ కుక్కలను భారత సాయుధ దళాలు పారిస్‌కు పంపించాయి. అంతర్జాతీయ అసైన్‌మెంట్‌కు బెంగళూరులో పుట్టి పెరిగిన రెండు కుక్కలు ఐదేళ్ల వాస్ట్, మూడేళ్ల డెన్బీ కూడా వెళ్లాయి. ఇవి వివిధ వెన్యూలలో స్నిఫ్ఫింగ్, పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వహిస్తాయి.
ఇండియా హౌస్‌లో ప్రదర్శనలు
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ రూపొందించిన ఇండియా హౌస్ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం మొట్టమొదటి పెవిలియన్. ఇండియా హౌస్‌లో ప్రముఖ భారతీయ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.
రఘు దీక్షిత్: రఘు దీక్షిత్‌కి చెందిన బహుభాషా జానపద సంగీత బ్యాండ్(Multilingual Folk Music Band), రఘు దీక్షిత్ ప్రాజెక్ట్ రాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. బ్యాండ్ పార్క్ డి లా విల్లెట్‌లోని ఒలంపిక్ హౌస్ ఆఫ్ ఇండియాలో జులై 29, 30 తేదీల్లో గంటసేపు ప్రదర్శన ఇవ్వనుంది.
షాన్: బాలీవుడ్ గాయకుడు షాన్ జులై 27న ఇండియా హౌస్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో మొట్టమొదటి ఇండియా హౌస్ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ గాయకుడు షాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. జులై 27న జరిగే ప్రారంభ వేడుకలో బాలీవుడ్, ఫ్యూజన్, బ్లాక్ బస్టర్ మ్యూజికల్ లైన్-అప్ ఉంటుంది.
పతకం సాధిస్తే భారీ ప్రైజ్‌మనీ!- ఏయే దేశం ఎంత ఇస్తుందంటే? - Paris Olympics 2024
ఒలింపిక్స్‌లో ప్రవాస భారతీయులు - ఏయే క్రీడల్లో ఉన్నారంటే? - Paris Olympics 2024