ICC Test Ranking: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ - 10లో చోటు కోల్పోయాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో బాబర్ ఏకంగా మూడు స్థానాలు దిగజారి 12వ స్థానం (712 రేటింగ్స్)లో నిలిచాడు. కాగా, గత ఐదేళ్లలో బాబర్ టాప్- 10లో చోటు కోల్పోయవడం ఇదే తొలిసారి. అతడు 2019 డిసెంబర్లో 13వ ప్లేస్‌లో ఉండగా, తర్వాత టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం పాక్ నుంచి మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే (720 రేటింగ్స్) టాప్ -10లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 922 రేటింగ్స్‌తో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు.
కాగా, టీమ్ఇండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ (751 రేటింగ్స్), యశస్వీ జైస్వాల్ (740 రేటింగ్స్), విరాట్ కోహ్లీ (737 రేటింగ్స్) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్ (859) రెండో స్థానంలో, డారిల్ మిచెల్ (768) మూడో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ (757) ఒక స్థానం మెరుగై నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ (753) ఐదో స్థానానికి పడిపోయాడు.
Joe Root’s ascendancy at the top of ICC Men’s Test Batter Rankings continues 🔥#ICCRankings details ⬇️https://t.co/i6kYud5Qi5
— ICC (@ICC) September 4, 2024