ETV Bharat / sports

పాక్ క్రికెటర్లకు షాక్- సెంట్రల్ కాంట్రాక్ట్​లు రద్దేనంట! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Pakistan T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే పాక్‌ వెనుదిరగడంపై విమర్శల జడివాన కురుస్తూనే ఉంది. పాక్ పేలవ ప్రదర్శనపై ఆ దేశ మాజీ క్రికెటర్లే భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో పాక్ క్రికెట్​లో భారీ మార్పులు చేయడానికి బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Pakistan World Cup
Pakistan World Cup (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 7:22 PM IST

Pakistan T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​ ఓటమితో పాకిస్థాన్ జట్టు ప్లేయర్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. పొట్టికప్​లో పాక్ ఆటతీరు బాగా లేదని స్వయంగా పలువురు పాక్ మాజీ క్రికెటర్లే అభిప్రాయలు వ్యక్తపరిచారు. జట్టులోని సీనియర్‌ క్రికెటర్లను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే 2022 టీ20 వరల్డ్​కప్ ఓటమి తర్వాత పాక్ క్రికెట్ బోర్డులో మార్పులు జరిగాయి. అప్పట్నుంచి బోర్డుకు ముగ్గురు ఛైర్మన్లు మారారు. పలువురు కోచ్​ల మార్పు కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో మరోసారి పాక్‌ క్రికెట్​లో భారీ మార్పులు చేయాలని బోర్డు భావిస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే ఈసారి బోర్డు ప్లేయర్ల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని టాక్. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన సీనియర్‌ ఆటగాళ్లను మళ్లీ సెంట్రల్‌ కాంట్రాక్టుల్లోకి తీసుకునేందుకు పీసీబీ ఛైర్మన్‌ మొహ్సిన్ నఖ్వీ సుముఖంగా లేడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు తప్పే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లను కలిగి ఉన్న ఆటగాళ్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని, లేదా పూర్తిగా తొలగించవచ్చని బోర్డు వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఇక ఆటగాళ్లకు లభించే ఇతర ప్రోత్సాహకాలను కూడా ఓసారి పరిశీలించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస పేలవమైన ప్రదర్శనల కారణంగానే పీసీబీ ఈ చర్యలు తీసుకోనుంది.

మళ్లీ పాత పద్దతే!
అయితే చీఫ్ సెలక్టర్ లేకుండానే టీ 20 ప్రపంచకప్​కు జట్టును ఎంపిక చేయగా, అది పూర్తిగా విఫలం అయ్యింది. దీంతో చీఫ్ సెలెక్టర్ లేకపోవడమే జట్టు వైఫల్యాలకు కారణమని పీసీబీ అభిప్రాయపడింది. ఈ ఘోర వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పాత సెలక్షన్ కమిటీ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో సెలక్షన్‌ కమిటీలో ముగ్గురు చైర్మన్‌లను పీసీబీ భర్తీ చేయనుంది. ఇద్దరు లేదా ముగ్గురు సెలెక్టర్లతో సహా చీఫ్ సెలెక్టర్, కెప్టెన్, ప్రధాన కోచ్‌ ఇలా అందరూ కూర్చొని చర్చించిన తర్వాతే జట్టు ఎంపిక జరిగేలా చర్యలు తీసుకోనుందని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఫ్యాన్​పై దాడికి దిగిన పాక్ క్రికెటర్ - భార్య ఆపినా కూడా! - Haris Rauf Pakistan Cricketer

'వాళ్లు ఎలిమినేట్‌ కావడం బాధగా ఉంది -షాహిద్‌ అఫ్రిది పాక్​కు సాయం చేయాలి' - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.