Ind vs Pak T20 World Cup: టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ రెండు జట్ల మధ్య సమరం క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. జూన్ 9న న్యూయార్ వేదికగా దాయాదుల సమరం జరగనుంది. దీని కోసం క్రికెట్ ప్రేమికులు కోట్ల కళ్లతో ఎదురుచూస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. మరోసారి అలాంటి మ్యాచ్ చూడవచ్చని అభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఎదుర్కొనే వ్యూహంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా స్పందించాడు.
భారత్- పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ ఎప్పుడూ చర్చనీయాంశమే అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. 'భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడి ప్రభావం మ్యాచ్‌పై పడకుండా చూసుకోవాలి. మేం దానిని అధిగమించి ప్రశాంతంగా ఆడాల్సి ఉంటుంది. కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని మా టీమ్‌మేట్స్‌కు చెబుతుంటాను. భారత్‌తో మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా,ఒత్తిడిని అధిగమిస్తాం. 2021 వరల్డ్‌కప్‌లో మేం టీమ్ఇండియాపై గెలిచాం. మరోసారి అలాంటి విజయాన్ని రిపీట్ చేస్తామన్న నమ్మకం మాకు ఉంది. ఇక 2022 టీ 20 ప్రపంచకప్‌లో మేం ఫైనల్ దాకా వెళ్లినా, షహీన్ షా అఫ్రిదీకి గాయం కావడం తుదిపోరులో మా విజయావకాశాలను దెబ్బ తీసింది' అనిని బాబర్ అన్నాడు.
అందరి దృష్టి ఇక్కడే! ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుందని, ఆటగాళ్ళు విభిన్న భావోద్వేగాలతో ఉంటారని ఆజమ్ అన్నాడు. భారత్- పాక్ అభిమానులు తమ జట్టు ప్రదర్శనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పోడ్‌కాస్ట్‌లో తెలిపాడు.
భారత్‌దే పైచేయి
ఐసీసీ ఈవెంట్‌లలో పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. టీ20 ప్రపంచ కప్‌లలో దాయాదులు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడగా ఏడింటిలో టీమ్ఇండియా నెగ్గింది. 2021 ఎడిషన్‌లో భారత్‌పై పాక్ గెలిచింది.
'మా గేమ్ ప్లాన్ మారింది- వరల్డ్‌కప్‌లో కొత్త పాకిస్థాన్‌ను చూస్తారు' - T20 World Cup
భారత్ - పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.17 లక్షలా? - T20 WorldCup 2024