Mayank Yadav Debut : భారత్ - బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌తో పేస్ సంచలనం మయాంక్ యాదవ్ టీమ్ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. మాజీ ప్లేయర్ పార్ధివ్ పటేల్ మయాంక్‌కు క్యాప్ అందజేశాడు. ఇక జాతీయ జట్టులోకి వచ్చీ రావడంతోనే మయాంక్ తనదైన స్టైల్లో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లోనే మయాంక్ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా మలిచి సత్తా చాటాడు. ఈ క్రమంలో టీ20 అరంగేట్రంలో తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా మలిచిన భారత మూడో బౌలర్‌గా నిలిచాడు. మయాంక్ కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరో తెలుసా?
ఇంటర్నేషనల్ టీ20 డెబ్యూలో తొలి ఓవర్ మెయిడెన్ వేసిన బౌలర్లు
అజిత్ అగార్కర్ vs సౌతాఫ్రికా (2006)
టీమ్ఇండియా దిగ్గజ ప్లేయర్ అజిత్ అగార్కర్ 2006 సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. జొహెన్నస్‌బర్గ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అగార్కర్ 6వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. ఇక క్రీజులో ఉన్న హర్షెల్ గిబ్స్‌ను అగార్కర్ ఓవర్ అంతా ఇబ్బంది పెట్టాడు. ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ టీ20 డెబ్యూలో తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా మలిచిన భారత తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
అర్షదీప్ సింగ్ vs ఇంగ్లాండ్ (2022)
2022 సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్లోనే బౌలింగ్ వేసే అవకాశం వచ్చిన అర్షదీప్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. తన స్వింగ్ బంతులతో క్రీజులో ఉన్న జేసన్ రాయ్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. అలా ఈ ఓవర్లో అర్షదీప్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు (కానీ, రెండు లెగ్ బై సింగిల్స్ వచ్చాయి). దీంతో ఈ ఘనత సాధించిన టీమ్ఇండియా రెండో బౌలర్‌గా రికార్డు కొట్టాడు. అగార్కర్ తర్వాత దాదాపు 16ఏళ్లకు మరో బౌలర్ ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో అర్షదీప్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌పై భారత్ 50 పరుగుల తేడాతో నెగ్గింది.
That's some start to Mayank Yadav's international career ⚡️⚡️
— BCCI (@BCCI) October 6, 2024
He starts off with a maiden 🔥
Live - https://t.co/Q8cyP5jXLe#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/XyqJxarYxO
కాగా, ఈ మ్యాచ్‌లో మయాంక్ తన పూర్తి కోటాలో 5.20 ఎకనమీతో 21 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, బంగ్లాపై భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది.
హార్దిక్ పాండ్య 'నో లుక్ షాట్'- ఏమి కాన్ఫిడెన్స్ బాసు!- వీడియో వైరల్ - Hardik No Look Shot
టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ షో- బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ - India Vs Bangladesh T20