ETV Bharat / sports

పారాలింపిక్స్​లో అదరగొట్టిన అథ్లెట్లు - నిషాద్‌కు రజతం, ప్రీతికి కాంస్యం - Paralympics 2024

Nishad Kumar Paralympics 2024 : పారాలింపిక్స్‌లో తాజాగా భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్‌ టీ47లో యంగ్ అథ్లెట్ నిషాద్‌ కుమార్‌ వెండి పతకం సొంతం చేసుకున్నాడు. మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్‌ కాంస్యం సాధించింది.

PARALYMPICS 2024
PARALYMPICS 2024 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 7:15 AM IST

Nishad Kumar Paralympics 2024: పారాలింపిక్స్‌లో తాజాగా భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్‌ టీ47లో యంగ్ అథ్లెట్ నిషాద్‌ కుమార్‌ వెండి పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్​లో అతడు 2.04 మీటర్ల ఎత్తు దూకి రికార్డును నెలకొల్పాడు. ఇక ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్‌ రాంపాల్‌ మాత్రం (1.95) ఏడో స్థానంలో నిలిచాడు.

ఇదిలా ఉండగా, మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్‌ కాంస్యం సాధించింది. ఫైనల్​లో 30.01 సెకన్లలో రేసు ముగించి అధ్బుతమైన పెర్ఫామెన్స్​తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో రాకేశ్‌ కుమార్‌ త్రుటిలో పతకం చేజార్చుకున్నాడు. కాంస్య. పతక పోరులో ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ 146-147తో టోక్యో పారాలింపిక్‌ ఛాంపియన్‌ హి జియావో (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.

షట్లర్లు అదరహో :
ఇక ఈ విశ్వ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పతకాల వేటలో సాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌ SL3లో నితేశ్‌ కుమార్, SL4లో సుహాస్‌ ఫైనల్‌ పోరుకు చేరుకుని కనీసం రజతాలు ఖాయం చేశారు. ఆదివారం సెమీస్‌లో నితేశ్‌ 21-16, 21-12తో జపాన్‌ ప్లేయర్ డైసుకె ఫుజిహారపై గెలిచాడు. దీంతో సోమవారం తుదిపోరులో టోక్యో పారాలింపిక్స్‌ రజత విజేత డానియల్‌ బెతెల్‌ (బ్రిటన్‌)ను ఢీకొట్టనున్నాడు.

మరోవైపు SL4 సెమీస్‌లో టాప్‌సీడ్‌ సుహాస్‌ యతిరాజ్‌ 21-17, 21-12తో సుకాంత్‌పై గెలపొందాడు. టోక్యోలో రజతం గెలిచిన సుహాస్‌ వరుసగా రెండో సారి ఫైనల్‌ చేరాడు. గోల్డ్ మెడల్ కోసం ఫ్రాన్స్‌ ప్లేయర్ లుకాస్​తో తలపడనున్నారు. అయితే కాంస్య పతక పోరులో ఇండోనేసియా ప్లేయర్ సెటియవాన్​తో సుకాంత్‌ పోటీపడనున్నాడు.

మహిళలు కూడా ఈ విశ్వ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. సింగిల్స్‌ SU5లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సెమీస్‌లో తులసిమతి మురుగేశన్‌తో మనీషా రామ్‌దాస్‌ తలపడనుంది. ఈ విభాగంలో టాప్‌సీడ్‌ తులసిమతి ఇప్పటికే సెమీస్‌ చేరగా, తాజాగా క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ మనీషా 21-13, 21-16తో జపాన్ ప్లేయర్ మమికోను చిత్తుచేసింది.

SH6 క్వార్టర్స్‌లో 21-4, 21-7తో పోలెండ్​కు చెందిన ఒలీవియాను మట్టికరిపించిన టాప్‌ సీడ్‌ నిత్యశ్రీ సెమీస్‌లో చైనా ప్లేయర్ షాంగ్‌బావోను ఢీకొట్టనుంది. మరోవైపు పలక్‌ కోహ్లి (SL 4), మన్‌దీప్‌ కౌర్‌ (SL3) పోరాటం ముగిసింది. ఇక మహిళల WS4 టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో భవీనా బెన్‌ 3-0తో మెక్సికో ప్లేయర్ వెర్డిన్​పై గెలిచింది.

ఆంధ్ర ప్లేయర్ 5వ స్థానం :
పురుషుల F40 షాట్‌పుట్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ పారా అథ్లెట్‌ రవి రొంగలి అయిదో స్థానానికి పరిమితమయ్యాడు. ఫైనల్లో ఇనుపగుండును 10.63 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసినప్పటికీ పతకం గెలిచేందుకు అది సరిపోలేదు. పారాలింపిక్‌ రికార్డుతో మిగెల్‌ (పోర్చుగల్‌- 11.21మీ) పసిడి పట్టేశాడు. బటుల్గా (మంగోలియా- 11.09మీ), గారా (ఇరాక్‌- 11.03మీ) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.

ఇక మహిళల 1500మీ. టీ11 రేస్‌లో రక్షిత రాజు హీట్స్‌లోనే నిష్క్రమించింది. హీట్‌-3లో 5 నిమిషాల 29.92 సెకన్ల టైమింగ్‌తో చివరి స్థానంలో నిలిచి ఆమె ఫైనల్‌ పోరుకు వెళ్లలేకపోయింది. పారా రోయింగ్‌ PR 3 మిక్స్‌డ్‌ డబుల్‌ స్కల్స్‌ను నారాయణ (ఏపీ)- అనిత జోడీ ఎనిమిదో స్థానాంతో సరిపెట్టుకుంది. 7-12 స్థానాల వర్గీకరణ కోసం నిర్వహించిన ఫైనల్‌-బి రేసులో ఈ జంట 8 నిమిషాల 16.96 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది.

అవని గురి తప్పింది :
10మీ.ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1లో గోల్డ్​ సాధించిన అవని లేఖరా, మిక్స్‌డ్‌లో మాత్రం గురి తప్పింది. మిక్స్‌డ్‌ 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ SH1లో ఆమె ఫైనల్‌ చేరలేకపోయింది. మరో భారత షూటర్‌ సిద్ధార్థ బాబు కూడా విఫలమయ్యాడు. క్వాలిఫైయర్ రౌండ్​లో అవని (632.8) 11వ, సిద్ధార్థ (628.3) 28వ స్థానాల్లో నిలిచారు. టాప్‌-8లో నిలిచిన వాళ్లు మాత్రమే ఫైనల్‌ చేరారు. మరోవైపు మిక్స్‌డ్‌ 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ SH2 క్వాలిఫికేషన్​లో శ్రీహర్ష (630.2) 26వ స్థానంతో ముగించాడు. ఈ మిక్స్‌డ్‌ విభాగాల్లో మహిళలు, పురుష షూటర్లు పతకం కోసం తలపడేందుకు సిద్ధమవుతున్నారు.

: పారాలింపిక్స్‌లో తాజాగా భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్‌ టీ47లో యంగ్ అథ్లెట్ నిషాద్‌ కుమార్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్​లో అతడు 2.04 మీటర్ల ఎత్తు దూకి రికార్డును నెలకొల్పాడు. ఇక ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్‌ రాంపాల్‌ మాత్రం (1.95) ఏడో స్థానంలో నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.