ETV Bharat / sports

పదో వికెట్​కు రికార్డ్​ పార్ట్​నర్​షిప్​ - టాప్ 10 జోడీలివే! - 10th Wicket Partnership Record

New Zealand VS Australia 10th Wicket Partnership Record In Test : న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టెస్ట్​ మ్యాచ్​లో ఆసీస్​ ప్లేయర్స్​ కామెరూన్​ గ్రీన్​ - జోష్ హేజిల్​వుడ్​ పదో వికెట్​కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది రికార్డ్​ పరంగా 16వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో చివరి వికెట్​కు అత్యధిక పరుగులు చేసిన టాప్ - 10 జోడీల గురించి ఈ స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం.

పదో వికెట్​కు రికార్డ్​ పార్ట్​నర్​షిప్​ - టాప్ 10 జోడీలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 3:16 PM IST

New Zealand VS Australia 10th Wicket Partnership Record In Test : వెల్లింగ్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయం సాధించింది. 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌, ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్‌ 6 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును బంబేలెత్తించాడు. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా తమ రెండు ఇన్నింగ్స్​లో - 383, 164 పరుగులు చేయగా న్యూజిలాండ్‌ 179, 196 రన్స్ సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఆసీస్​ ప్లేయర్స్​ కామెరూన్​ గ్రీన్​ - జోష్ హేజిల్​వుడ్​ పదో వికెట్​కు 116 పరుగులు జోడించారు. ఇది రికార్డ్​ పరంగా 16వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో చివరి వికెట్​కు అత్యధిక పరుగులు చేసిన టాప్ - 10 జోడీల గురించి ఈ స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం.

  • 2014లో ఇంగ్లాండ్ టీమ్​ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్​లో జో రూట్ - అండర్సన్​ పదో వికెట్​కు 198 పరుగులు జోడించి ఆకట్టుకున్నారు.
  • 2013లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్​ తలపడిన పోరులో పీజే హ్యూజ్​ - అగర్​ పదో వికెట్​కు 163 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
  • 1973లో న్యూజిలాండ్ పాకిస్థాన్ పోటీ పడిన మ్యాచ్​లో హాస్టింగ్స్​ - కొలింగె పదో వికెట్​కు 151 పరుగులు జోడించారు.
  • 1997లో పాకిస్థాన్​ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్​లో అజ్​హర్ మహమూద్​ - ముస్తాఖ్​ అహ్మద్​ 151 పరుగుల పార్టర్న్​షిప్​ చేశారు.
  • 2012లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ తలపడిన సమయంలో రామ్​దిన్​ - బెస్ట్​ 143 రన్స్​ జోడించి అందరి దృష్టిని ఆకర్షించారు.
  • 1977లో వసీమ్​ రజా - వసీమ్ బరి పాకిస్థాన్​ వెస్టిండీస్ మధ్య సాగిన పోరులో 133 రన్స్​ నమోదు చేశారు.
  • 2004లో టీమ్​ ఇండియా బంగ్లాదేశ్ తలపడిన సమయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​ - జహీర్​ ఖాన్​ 133 రన్స్ జోడించారు.
  • 1903లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తలపడినప్పుడు ఫోస్టర్ - రోడ్స్​ 130 పరుగులు నమోదు చేశారు.
  • 1966లో ఇంగ్లాండ్ వెస్టిండీస్​ మధ్య జరిగిన మ్యాచ్​లో హిగ్స్​ - జేఏ స్నో 128 రన్స్​ పార్ట్నర్​షిప్ చేశారు.
  • 20013లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్​లో వాట్లింగ్ - బౌల్ట్ జోడీ​ 127 పరుగులు జోడించారు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్​ - పొట్టి కప్​ కోసం ఒక్క టికెట్ ధర రూ. 1.84 కోట్లు!

50 మంది అతిథులకు రూ.100 కోట్ల ఖర్చు - క్రికెటర్లలో అత్యంత ఖరీదైన పెళ్లి ఎవరిదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.