Rishabh Pant IPL Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడిని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దిల్లీ జట్టు పంత్‌ను వదిలిపెట్టడంపై పలు వార్తలు వచ్చాయి. యాజమాన్యంతో విభేదాలు, డబ్బు కారణంగానే పంత్‌ను దిల్లీ అట్టిపెట్టుకోలేదని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాంటి వార్తలకు దిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ క్లారిటీ ఇచ్చారు.
'దిల్లీ జట్టుకు ఆడేందుకు పంత్ ఇష్టపడలేదు. మెగావేలంలోకి వెళ్లాలనుకున్నాడు. అలాగే పంత్ తన మార్కెట్‌ను పరీక్షించుకోవాలనుకున్నాడు. ఏ ఆటగాడినైనా అట్టిపెట్టుకోవడానికి యజమాన్యం, ప్లేయర్ మధ్య సమ్మతి అవసరం. మేము పంత్‌ను ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా సంప్రదించాం. తాను వేలానికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు. అత్యధిక రాబడిని పొందడానికి తనకు మంచి అవకాశం ఉందని పంత్ భావించాడు' అని బదానీ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్‌ను రిటైన్ చేసుకోవడానికి దిల్లీ ఆసక్తి కనబరించిందని బదానీ తెలిపారు. 'మెగా వేలంలో అత్యధిక క్యాప్ రూ.18కోట్లు కంటే ఎక్కువ డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయని పంత్ చెప్పాడు. అతడిని వేలంలో లఖ్‌నవూ రూ.27కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ మంచి ఆటగాడు. అతడిని మిస్ అవుతున్నాం' అని వ్యాఖ్యానించాడు.
Aa rahe hain, humari team me chaar chaand lagane, Rishabh bhaiya 🔥 pic.twitter.com/dXPRFRmLwn
— Lucknow Super Giants (@LucknowIPL) November 24, 2024
డబ్బు కోసం కాదు
దిల్లీకి రిషభ్ కు మధ్య గ్యాప్ వచ్చిందని, ముఖ్యంగా డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయని మెగావేలం ముందు వార్తలు వచ్చాయి. మరికొందరేమో పంత్ కావాలనే ఫ్రాంఛైజీ మారాలని భావించాడని చెప్పారు. కాగా టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
డబ్బు విషయంలోనే పంత్‌కు, ఫ్రాంఛైజీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. దీనిపై రిషభ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. దిల్లీ ఫ్రాంఛైజీని వీడేందుకు డబ్బు కారణం కాదని పేర్కొన్నాడు. 'నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను కచ్చితంగా చెప్పగలను' అని బదులిచ్చాడు.
అందుకే జట్టును వీడాడు
అలాగే దిల్లీని పంత్ వీడడానికి డబ్బు కారణం కాదని ఆ జట్టు సహ యజమాని పార్ద్ జిందాల్ గతంలో వ్యాఖ్యానించారు. 'గత కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శన మేనేజ్‌మెంట్ అంచనాలకు తగ్గట్లుగా లేదని చెప్పాం. పంత్ కెప్టెన్సీ గురించి నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చాం. ఈ ఫీడ్ బ్యాక్‌ను అతను అపార్థం చేసుకున్నాడు. వెంటనే భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు' అని జిందాల్ అన్నారు. అయితే సునీల్ గావస్కర్, జిందాల్ వ్యాఖ్యలకు భిన్నంగా దిల్లీ హెడ్ కోచ్ బదానీ పంత్ పై చేయడం గమనార్హం.
రూ. 27 కోట్లు కాదు! - ఐపీఎల్ రెమ్యూనరేషన్లో పంత్‌కు వచ్చేది ఎంతంటే?
'ఫీజు విషయంలో డీల్ కుదిరినట్లు లేదు - అందుకే వేలంలోకి పంత్!'