ETV Bharat / sports

1 పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం- ఉత్కంఠ పోరులో నేపాల్​కు నిరాశ - T20 World Cup 2024

NEPAL vs SA World Cup 2024: 2024 ప్రపంచకప్​లో నేపాల్​కు నిరాశ ఎదురైంది. శనివారం సౌతాఫ్రికాతో మ్యాచ్​లో 1 పరుగు తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

NEPAL vs SA T20
NEPAL vs SA T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 9:48 AM IST

Updated : Jun 15, 2024, 10:12 AM IST

NEPAL vs SA World Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. కింగ్​స్టన్ వేదికగా సౌతాఫ్రికా- నేపాల్ జట్లు శనివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పసికూన నేపాల్​పై సౌతాఫ్రికా 1 పరుగు తేడాతో నెగ్గింది. దీంతో నేపాల్ పొట్టికప్పు చరిత్రలో చారిత్రక విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో నేపాల్ ఓవర్లన్నీ ఆడి 114-7కే పరిమితమైంది. సఫారీ జట్టు బౌలర్లలో తబ్రేజ్ షంసీ 4, ఎయిడెన్ మర్​క్రమ్, అన్రీచ్ నోకియా తలో వికెట్ దక్కించుకున్నారు.

స్వల్ప లక్ష్య ఛేదనను నేపాల్ మెరుగ్గానే ఆరంభించింది. పవర్​ప్లేలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. అప్పటిదాకా గేమ్​లో లేని సౌతాఫ్రికా ఒక్కసారిగా పుంజుకుంది. 9 ఓవర్ బౌలింగ్ చేసిన స్పిన్నర్ షంసీ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాకు బ్రేక్ ఇచ్చాడు. తర్వాత కాసేపు వికెట్లు వికెట్లు పడకపోయినా పరుగులు రావడం కష్టమైంది. 18 ఓవర్లు ముగిసేసరికి కూడా నేపాల్ 100-5తో మంచి స్థితిలోనే ఉంది. 19 ఓవర్లో నేపాల్ 8 పరుగులు చేసింది. దీంతో 6 బంతుల్లో 8 పరుగులు కావాల్సి వచ్చింది.

ఈ దశలో సౌతాఫ్రికా బౌలర్ బార్త్​మన్ తొలి రెండు బంతులను డాట్స్​గా మలిచాడు. మూడో బంతిని బ్యాటర్ గుల్షన్ ఝా ఫోర్​గా మలిచాడు. నాలుగో బంతికి 2 పరుగులు వచ్చాయి. దీంతో 2బంతుల్లో 2 పరుగులు కావాల్సి వచ్చింది. అంతే నేపాల్ చారిత్రక విజయం నమోదు చేస్తుందని అందరూ భావించారు. కానీ, చివరి రెండు బంతులు కూడా డాట్స్​ కావడం వల్ల నేపాల్​కు ఓటమి తప్పలేదు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్ (42 పరుగులు), అనిల్ షా (27 పరుగులు) రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రీజా హెన్రిక్స్ (43 పరుగులు) మాత్రమే రాణించాడు. డికాక్ (10), మర్​క్రమ్ (15), క్లాసెన్ (3), డేవిడ్ మిల్లర్(7) ఫెయిల్ అయ్యారు. చివర్లో స్టబ్స్ (27*) రాణించాడు. ఇక నేపాల్ బౌలర్లలో కుశాల్ 4, దీపేంద్ర సింగ్ 3 వికెట్లు పడగొట్టారు.

కాగా, ఈ ఓటమితో నేపాల్ టోర్నీ నుంచి అఫీషియల్​గా నిష్క్రమించింది. ఇప్పటివరకు 3 మ్యాచ్​లు ఆడగా, రెండిట్లో ఓడింది. ఒక మ్యాచ్​లో ఫలితం తేలలేదు. ఇక జూన్ 16న బంగ్లాదేశ్​తో తమ ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు సౌతాఫ్రికా గ్రూప్ స్టేజ్​లో ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో నాలుగింట్లోనూ నెగ్గి 8 పాయింట్లతో టాప్​లో ఉంది.

సూపర్‌-8కు అమెరికా - పాకిస్థాన్‌ ఔట్​ - T20 Worldcup 2024

విరాట్ సంగతేంటి!! సూపర్-8కు ముందు మార్పులు తప్పవా? - T20 Worldcup 2024

Last Updated : Jun 15, 2024, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.