Neeraj Chopra Mom Special Dish : భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లికి లేఖ రాశారు. అందులో ఆమె ఇంట్లో తయారు చేసిన స్పెషల్ వంటకం గురించి ప్రస్తావించి కొనియాడారు. గతంలో ఇంట్లో తయారుచేసిన చుర్మా తనకు కావాలని కొన్నిరోజుల క్రితం నీరజ్ చోప్రాను మోదీ కోరగా, దానికి నీరజ్ తల్లి సరోజ్ దేవి తాజాగా మోదీ కోసం ప్రత్యేకంగా చుర్మా తయారు చేసి పంపారు. అది తిన్న ఆయన తన ఆనందాన్ని ఓ లేఖ రూపంలో రాశారు.
"నీరజ్ ఈ చుర్మా గురించి గతంలో నాతో చెప్పాడు. కానీ ఈ రోజు అది తిన్న తర్వాత నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మీ అపారమైన ప్రేమ, ఆప్యాయతతో నిండిన ఈ బహుమతి నాకు మా అమ్మను గుర్తు చేసింది. అమ్మ శక్తి, ఆప్యాయత, అంకిత భావానికి ప్రతిరూపం. ఇది చాలా యాదృచ్ఛికం. నవరాత్రి పండుగకు ఒక్క రోజు ముందు నాకు ఈ అమ్మవారి ప్రసాదం లభించింది. సాధారణంగా నవ రాత్రులలో 9 రోజులు నేను ఉపవాసం ఉంటాను. ఓ రకంగా మీరు తయారు చేసిన ఈ చూర్మ నా ఉపవాసానికి ముందు నా ప్రధాన ఆహారంగా మారింది. మీరు చేసిన ఆహారం రుచి చూశాక, సోదరుడు నీరజ్‌కు దేశం కోసం పతకాలు సాధించే శక్తిని ఎలా వస్తుందో నాకు బాగా అర్ధమైంది. అదే విధంగా ఈ చూర్మ శక్తి నవరాత్రుల సందర్భంగా దేశానికి సేవ చేయడానికి నాకు బలాన్ని ఇస్తుంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే నా సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి నేను మరింత అంకితభావంతో పని చేస్తానని హామీ ఇస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ నీరజ్ చోప్రా తల్లిని కొనియాడారు.
PHOTO | PM Modi's letter to India's two-time Olympic medal-winning javelin throw star Neeraj Chopra's mother Saroj Devi.
— Press Trust of India (@PTI_News) October 2, 2024
(Source: Third Party) pic.twitter.com/QjnePhYWFM
ఏమైందంటే?
పారిస్ ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు మన అథ్లెట్స్‌తో ప్రధాని ముచ్చటించారు. అప్పుడే నీరజ్ తల్లి చేసే చుర్మా తినాలని ఉందంటూ మోదీ తన మనసులోని మాట బయటపెట్టారు. అప్పుడు నీరజ్ తల్లి కూడా ఆ వంటకాన్ని తయారు చేసి పంపిస్తానంటూ మోదీకి తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తయారు చేసిన చుర్మాను ప్రధాని మోదీకి పంపించగా, దానికి ఆయన ఇలా స్పందించారు.
'వేలు విరిగినా బరిలోకి దిగాను'- డైమండ్ లీగ్ ఫైనల్‌పై నీరజ్ - Neeraj Chopra Diamond League
నీరజ్, మను బాకర్ నెట్‌వర్త్- ఇండియన్ టాప్ రిచ్చెస్ట్ అథ్లెట్లు వీళ్లే! - Indian Athletes Net Worth