Syed Mushtaq Ali Trophy 2024 : 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన తుదిపోరులో ముంబయి 5 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ ముద్దాడింది. 175 పరుగుల లక్ష్య ఛేదనను ముంబయి 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యంగ్ బ్యాటర్ సుయాంశ్ షెగ్డే (36* పరుగులు: 15 బంతుల్లో; 3x4, 3x6) చివర్లో రఫ్పాడించాడు. అథర్వ అంకోలేకర్ (16*: 6 బంతుల్లో; 2x6) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సూర్యకుమార్ యాదవ్ (48 పరుగులు), అజింక్యా రహానే (37 పరుగులు) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేష్ సింగ్ 2, శివమ్ శుక్లా, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (81* పరుగులు: 40 బంతుల్లో; 6x4, 6x6) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మధ్యప్రదేశ్‌కు మంచి స్కోర్ లభించింది. ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, డియాస్ చెరో 2, అథర్వ అంకోలేకర్, శివమ్ దూబె, సుయాంశ్ షెగ్డే తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
BCCI President Mr. Roger Binny hands over the trophy to Mumbai Captain Shreyas Iyer 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) December 15, 2024
Congratulations to Mumbai on winning the Syed Mushtaq Ali Trophy 2024-25 🏆
Scorecard - https://t.co/4J8WAjUsK9#SMAT | @IDFCFIRSTBank | @ShreyasIyer15 | @MumbaiCricAssoc pic.twitter.com/sESEonvYNd
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సూర్యాంశ్ షెడ్గే
- ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ - అజింక్య రహానె (469 పరుగులు)
కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడం ముంబయికి ఇది రెండోసారి. 2022/23 ఎడిషన్‌లో ముంబయి తొలిసారి కప్పు ముుద్దాడింది. మరోవైపు ఫైనల్లో ఓడడం మధ్యప్రదేశ్‌కు ఇది రెండోసారి. 2010లోనూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ ఓడగా, తాజా సీజన్లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
End of 10 overs!
— BCCI Domestic (@BCCIdomestic) December 15, 2024
The experienced duo of Ajinkya Rahane and Suryakumar Yadav are in the middle for Mumbai!
They need 86 off 60
Live - https://t.co/4J8WAjUsK9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/2R4mIQlTwA
ఇక అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన లిస్ట్‌లో తమిళనాడు టాప్‌లో ఉంది. అన్ని జట్ల కంటే ఎక్కువగా తమిళనాడు మూడుసార్లు (2006, 2021, 2022) కప్పు దక్కించుకుంది. బరోడా, గుజరాత్, కర్ణాటక రెండు రెండు సార్లు విజేతగా నిలిచాయి.
349 రన్స్, 37 సిక్సర్స్ - టీ20 క్రికెట్లో బరోడా టీమ్ నయా రికార్డు!
ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్- ఇది టీ20 హిస్టరీలోనే సంచలనం!