ETV Bharat / sports

ఆడపిల్ల అని వద్దనుకున్నారు, 9 నెలలకే పోలియో ఎఫెక్ట్ - వాళ్లిద్దరి సపోర్టే ఆమెకు బలం! - Paralympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 1:42 PM IST

Mona Aggarwal Paralympics 2024 : వైకల్యం అనేది శరీరానికి గానీ పట్టుదలకు కాదని నిరూపించింది పారా షూటర్ మోనా అగర్వాల్‌. జీవితంలో కష్టాలు, అవమానాలకు ఎదుర్కొని అనుకున్నది సాధించింది. అయితే ఆమె క్రీడా జర్నీ ఎలా సాగిందంటే?

Mona Aggarwal Paralympics 2024
Mona Aggarwal (ETV Bharat)

Mona Aggarwal Paralympics 2024 : ఆడపిల్లల్ని భారంగా భావించే కుటుంబంలో పారా షూటర్‌ మోనా అగర్వాల్‌ పుట్టింది. ఆమెకు ఇద్దరు అక్కలు. ఇక మూడో బిడ్డైనా కొడుకు పుడితే బాగున్ను అనుకున్నారు మోనా అగర్వాల్ తల్లిదండ్రులు. కానీ మోనా పుట్టడంతో నిరాశ చెందారు. ఆడపిల్ల అంటూ అయిష్టంగానే మోనాను పెంచారు. దీనికి తోడు తొమ్మిది నెలల ప్రాయంలో మోనా పోలియో బారిన పడింది. దాంతో ఆమె రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి.

అమ్మమ్మే స్పూర్తి
ఇలా మోనా జీవితం నరకప్రాయంగా మారింది. 'ఆడపిల్లే భారమనుకుంటే, అంగవైకల్యం కూడా తోడైంది.' అంటూ ఇరుగుపొరుగు వారు, బంధువులు ఆమెను ఆడిపోసుకునేవారు. అయినా ఈ సవాళ్లకు ఆమె ఎదురు నిలవగలిగిందంటే, అదంతా మోనా అమ్మమ్మ గీతా దేవి చలవే అని చెప్పాలి. ఎందుకంటే ఎవరెన్ని మాటలన్నా, దెప్పి పొడిచినా మోనా అమ్మమ్మే ఆమెలో ధైర్యం నింపేది. ఆమె స్ఫూర్తితోనే జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకుంది మోనా. ఈ క్రమంలోనే తనకు ఆసక్తి ఉన్న ఆటలపై ఫోకస్ చేసింది. తొలుత షాట్‌ పుట్‌, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో తదితర క్రీడల్లో రాణించినా షూటింగ్‌ ప్రయత్నించాక దాన్నే ఇష్టపడింది మోనా.

భర్త కూడా అండగా
కాగా, వీల్‌ ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు రవీంద్ర ఛౌధరిని వివాహం చేసుకుంది మోనా. అప్పుటి నుంచి మోనాకు భర్త ప్రోత్సాహం కూడా తోడైంది. దీంతో పూర్తి స్థాయిలో షూటింగ్‌ పై పట్టు పెంచుకుంది. 2021 నుంచి క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఇక ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌ లో పోటీ పడిన ఆమె, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్యం సాధించింది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న మోనా, అటు తన ఇద్దరు పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తూనే ఇటు షూటింగ్​లోనూ అదరగొడుతోంది.

'ఆ సమయం చాలా కఠినంగా అనిపించింది'
"గెలుపే మనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఒలింపిక్స్​లో మెడల్‌ సాధించాలని పట్టుదలతో ప్రయత్నించాను. ఫలితం దక్కింది. ఇందుకోసం చాలా శ్రమించా. శిక్షణ కోసం ఐదు నెలలు నా పిల్లలకు దూరంగా ఉన్నా. అప్పుడు చాలా కఠినంగా అనిపించింది. ఇక నా చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొన్నాను. ఆర్థికంగానూ ఇబ్బందులు పడ్డాను. ఒలింపిక్స్‌ లో పతకం గెలిచానన్న సంతోషం ముందు ఆ కష్టాలన్నీ ఆవిరైపోయాయి. చాలా ఆనందంగా ఉంది." అని మోనా అంటోంది.

వైకల్యాన్ని జయించి అదరహో- మెకానిక్ కూతురి విజయం వెనుక ఎంత పెద్ద కథో! - Rubina Francis Paralympics 2024

డాక్టర్ల తప్పిదంతో చేయి కోల్పోయి, యాక్సిడెంట్​లో అన్నయ్య దూరం - సిల్వర్​ మెడలిస్ట్​ మనీశ్ సక్సెస్​ స్టోరీ - PARALYMPICS MANISH NARWAL JOURNEY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.