ETV Bharat / sports

రికవరీ అప్డేట్​పై షమీ- కుట్లు తొలగించారని ట్వీట్

Mohammed Shami Surgery Update: టార్ బౌలర్ మహ్మద్ షమీ తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. సర్జరీకి సంబంధించిన ఫొటోలను ఎక్స్​లో షేర్ చేశాడు.

Mohammed Shami Surgery Update
Mohammed Shami Surgery Update
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 5:36 PM IST

Updated : Mar 13, 2024, 6:53 PM IST

Mohammed Shami Surgery Update: టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్​గా సర్జరీ కుట్లు తీసేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 'అందరికీ నమస్తే! నా రికవరీ గురించి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా. నాకు సర్జరీ పూర్తై 15 రోజులు అయ్యింది. తాజాగా ఆ కుట్లను తొలగించారు. గాయం నుంచి కోలుకోవడంలో పురోగతి సాధిస్తున్నాందుకు సంతోషిస్తున్నా. ట్రీట్​మెంట్​లో తదుపరి దశ కోసం ఎదురుచూస్తున్నా' అని ట్విట్టర్​లో పోస్ట్ షేర్ చేశాడు.

కాగా 2023 వరల్డ్​కప్​ సమయంలోనే షమీ కాలి మడమకు గాయమైంది. అయినప్పటికీ షమీ నొప్పితోనే ఆ టోర్నీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడం వల్ల షమీ ఆటకు దూరమయ్యాడు. వరుసగా 2023 డిసెంబర్​లో సౌతాఫ్రికా పర్యటన, 2024 జనవరిలో అఫ్గానిస్థాన్​తో టీ20 సిరీస్, రీసెంట్​గా ఇంగ్లాండ్​తో ముగిసిన టెస్టు సిరీస్​ షమీ దూరమయ్యాడు. ఇక గతనెల చివరి వారంలో షమీకి సర్జరీ జరిగింది. అప్పట్నుంచి షమీ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. తాజాగా సర్జరీకి సంబంధించిన కుట్లు తొలగించినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

మోదీ స్పెషల్ ట్వీట్: ఇక షమీ సర్జరీ పట్ల ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల స్పందించారు. 'మీరు త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న ధైర్యంతో ఈ గాయం బారిన నుంచి త్వరగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది' అని సర్జరీ గురించి షమీ తెలిపిన రోజే మోదీ ట్వీట్ చేశారు. కాగా, వన్డే వరల్డ్​కప్​లో షమీ భారత్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు మొత్తం టోర్నీలో 24 వికెట్లు పడగొట్టి, లీడింగ్ వికెట్ టేకర్​గా నిలిచాడు.

ఐపీఎల్​కూ దూరమే!: మరో 9 రోజుల్లోనే ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈక్రమంలో షమీ గుజరాత్ టైటాన్స్​ జట్టుకు ఆడాల్సి ఉంది. కానీ, గాయం నుంచి పూర్తిగా కోలుకోని షమీ ఈ సీజన్​కు దూరం కానున్నాడు. ఇక మార్చి 22న చెన్నై- బెంగళూరు మ్యాచ్​తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.

షమీ,​ పంత్​ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ!

IPL 2024 : షమీ ఔట్ - కోహ్లీ డౌట్!

Last Updated : Mar 13, 2024, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.