ETV Bharat / sports

IPL 2024 : షమీ ఔట్ - కోహ్లీ డౌట్! - ఐపీఎల్ షమీ సర్జరీ

Mohammed Shami Surgery : ఈ ఐపీఎల్​ సీజన్​కు మహమ్మద్ షమీ దూరం కానున్నాడని కన్ఫామ్ అయిపోయింది. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండటం అనుమానమే అని అర్థమైపోయింది. అయితే ఇతడితో పాటు కోహ్లీ కూడా ఐపీఎల్​కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.

IPL 2024 : షమీ ఔట్ - కోహ్లీ డౌట్!
IPL 2024 : షమీ ఔట్ - కోహ్లీ డౌట్!
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 2:38 PM IST

Mohammed Shami Surgery : ఈ ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతోంది. ఇంకా ఈ మెగా లీగ్ ప్రారంభం కానే లేదు అంతలోనే ఆటగాళ్లు దూరమవ్వడం ప్రారంభమైంది. తాజాగా మహ్మద్​ షమీ ఈ ఐపీఎల్​ సీజన్​కు అందుబాటులో ఉండడని కన్ఫామ్ అయిపోయింది. కామీ మడమ గాయంతో బాధపడుతున్న అతడికి లండన్​లో సర్జరీ సక్సెస్​ఫుల్​గా జరిగింది. దీంతో అతడికి కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి అవసరం. అంటే ఈ లెక్కన అతడు ఐపీఎల్​కు పూర్తి దూరమవ్వడంతో పాటు జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండటం అనుమానమే అని అర్థమైపోయింది.

జట్టుకు పెద్ద దెబ్బే : ఐపీఎల్‌లో గుజరాత్‌ జట్టు పేస్‌ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు షమీ. ఈ నేపథ్యంలో అతడు 2024 సీజన్‌కు దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అనే చెప్పాలి. కాగా, 2022 సీజన్‌లో టైటిల్ విన్నర్​గా నిలిచిన గుజరాత్‌ జట్టులో అతడు 20 వికెట్లు తీసి జట్టు విజేతగా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే 2023 సీజన్‌లోనూ షమీ 28 వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఆ సిరీస్​లన్నింటికీ దూరం : ప్రపంచకప్​లోని 7 మ్యాచుల్లో 24 వికెట్లు తీసి జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు షమి. చివరగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్​ ఫైనల్‌లో ఆడాడు. ఆ తర్వాత గాయం బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికా పర్యటన, ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సర్జరీ చేయించుకుని మరి కొంత కాలం పాటు జట్టుకు అందుబాటులో ఉండట్లేదు.

కోహ్లీ కూడా చెప్పలేని పరిస్థితి : టీమ్ ఇండియా స్టార్‌ బ్యాటర్​, ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌-2024లో ఆడతాడా? అంటే అది కూడా క్లారిటీ లేదు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ సిరీస్​కు దూరమైన అతడు ఐపీఎల్​కు వస్తాడా లేదా అనే విషయమై అనిశ్చితి నెలకొంది. ఆర్సీబీ తన తొలి మ్యాచ్​ను మార్చి 22న చెన్నైసూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది.

షమీ సర్జరీ సక్సెస్​ఫుల్​- త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.