ETV Bharat / sports

'అవన్నీ రూమర్స్, ఎవరూ నమ్మవద్దు'- గాయంపై షమీ క్లారిటీ - Mohammed Shami Injury

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Mohammed Shami About His Injury : టీమ్ఇండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని గాయం మళ్లీ వేధిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అదంతా అబద్ధం అని షమీ అన్నాడు.

Mohammed Shami Injury
Mohammed Shami Injury (Source: Getty Images)

Mohammed Shami About His Injury : టీమ్ఇండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయం నుంచి రికవరీ అవుతున్నాడు. 2023 వన్డే వరల్డ్​కప్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించున్న షమీ, అప్పట్నుంచి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ఇక పూర్తి ఫిట్​నెస్ సాధించి, టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడి మోకాలిలో మళ్లీ సమస్య తలెత్తిందని, దీంతో షమీ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడడం కష్టమేనని రీసెంట్​గా వార్తలు వచ్చాయి. ఇది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఈ ప్రచారంపై షమీ స్పందించాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు.

'ఇలాంటి రూమర్స్ ఎందుకు ప్రచారం చేస్తారు? నేను రికవరీ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నా. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐగానీ, నేనుగానీ చెప్పలేదు. ఇలాంటి ఆధారాల్లేని వార్తలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇటువంటి ఫేక్ రూమర్స్, అబద్ధాలను ప్రచారం చేయకండి' అని షమీ ట్విట్టర్​లో ట్వీట్ చేశాడు.

కాగా, ప్రస్తుతం షమీ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అయితే షమీ మోకాలికి కాస్త వాపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి షమీ ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. 6 నుంచి 8 వారాల్లోపు షమీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నిబంధన ఉంది. మరి షమీ దేశవాళిలో ఆడతాడా? లేదా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా అన్నది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుంది.

భారత్ జట్టు ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నవంబర్‌ 22 నుంచి తొలి టెస్టులో తలపడతాయి. పేస్‌కు అనుకూలంగా ఉండే ఆసీస్‌ పిచ్‌లపై షమీ కీలక పాత్ర పోషిస్తాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌తోపాటు షమీ కూడా జట్టులో ఉంటే పేస్ ఎటాక్‌ మరింత బలంగా ఉండనుంది.

టీమ్ఇండియాలోకి ఇప్పుడే రావాలని లేదు! : షమీ

షమీ రీఎంట్రీ మరింత ఆలస్యం- అప్పటిదాకా ఆగాల్సిందే! - Mohammed Shami Comeback

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.