Mitchell Starc IPL 2024: ఐపీఎల్ 2024 మొదలైపోయింది. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల ప్రదర్శనలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్‌కి ముందు 2023 చివర్లో మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యారు. అందులో పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర కావడం విశేషం. ఈ క్రమంలో అతడు వేసే ఒక్కో ఒక్కో బంతి విలువ ఎంతో తెలుసా?
ఐపీఎల్‌లో ఏ జట్టైనా కనీసం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. స్టార్క్‌ను భారీ దక్కించుకున్నందున అతడిని ఏ ఒక్క మ్యాచ్‌లోనూ బెంచ్‌కు పరిమితం చేసే ఛాన్స్ లేదు. ఈ లెక్కన స్టార్క్ అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. ఇక ప్రతి మ్యాచ్‌లో ఓ బౌలరైనా గరిష్ఠంగా 4 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఈ లెక్కన ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌ల్లో కలిపి స్టార్ 56 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్టార్క్ వేసే ఒక్కో బంతి దాదాపు రూ. 7.35 లక్షల విలువ అవుతుంది.
ఇక 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కోల్‌కతా మూడో టైటిల్ గెలవాలనే కసితో వేలంలో పోటీపడి మిచెల్ స్టార్క్‌ని కొనుగోలు చేసింది. అయితే స్టార్క్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2014, 2015లో రెండు IPL సీజన్లలో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2018లో మరోసారి వేలంలో అమ్ముడైనా, బరిలోకి దిగలేదు. దీంతో చాలాకాలం తర్వాత బరిలో దిగనున్న స్టార్క్‌పై అభిమానులు గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ లెజెండరీ బౌలర్ ఐపీఎల్ రీఎంట్రీతో కేకేఆర్‌కి మూడోకప్పు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కేకేఆర్ 2024 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
ఇటీవల కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్, స్టార్క్ కమ్‌బ్యాక్ గురించి మాడ్లాడాడు. 'ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ ఫామ్‌ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ప్రైస్ ట్యాగ్ అతనికి అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని నేను అనుకోను. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున చేసిన ప్రదర్శనలు, కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం కూడా చేయాలని మాత్రమే ఆశిస్తున్నాను' అని పేర్కొన్నాడు.
2024 ఐపీఎల్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, ఆంగ్క్రిష్, ఆండ్రీ రఘువాన్, ఆండ్రీ రఘువాన్ వెంకటేష్ అయ్యర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, షికిబ్ హుస్సేన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అప్పుడే హిట్టింగ్ స్టార్ట్ చేసిన 'రింకూ'- రూ.25 కోట్ల స్టార్క్ బౌలింగ్‌లో సూపర్ సిక్స్