Manoj Tiwary Team India : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇటీవలే అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ తెలిపారు. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నసంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు బంగాల్ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడ్తున్నారు. అయితే ఇటీవలే రంజీ ట్రోఫీలో బంగాల్ తరఫున ఆడాడు.
ఈ నేపథ్యంలో తాజాగా బిహార్‌తో చివరి మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత కోల్‌కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో జరిగిన ఓ సన్మాన సభలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందని ఆయన వ్యాఖ్యనించారు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ధోని తనను తొలగించకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా అత్యుత్తమ బ్యాటర్‌గా తాను అయ్యేవాడంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ విషయంపై ధోనీ ఏదో ఒక రోజు తనకు వివరణ ఇవ్వాల్సిందే అని అన్నారు.
"అవకాశం వచ్చినప్పుడు అతని నుంచి ఈ ప్రశ్నకు సమాధానాన్ని వినాలని నేను అనుకుంటున్నాను. నేను ధోనీని కచ్చితంగా అడుగుతాను. సెంచరీ చేసిన తర్వాత కూడా నన్ను ఎందుకు తీసేసారంటూ అతడ్ని అడుగుతాను. ముఖ్యంగా ఆ ఆస్ట్రేలియా పర్యటనలో ఎవరూ పరుగులు చేయలేదు. కోహ్లి, రోహిత్, రైనాలాంటి వాళ్లెవరూ రన్స్ చేయలేదు. నేనిప్పుడు కోల్పోయేది ఏమీ లేదు. నేను 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు పూర్తి చేసే సమయానికి నా బ్యాటింగ్ సగటు 65గా ఉంది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు మన దగ్గరికి వచ్చింది. వాళ్లపై ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లోనూ నేను 130 పరుగులు స్కోర్ చేశాను. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 93 పరుగులు సాధించాను. టెస్టుల్లో స్థానం దక్కుతుందని నేను ఎంతో ఆశించాను. కానీ సెలక్టర్లు యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేశారు." అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Manoj Tiwary Retirement : క్రికెట్‌కు బంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ గుడ్‌బై
ధోనీ, కోహ్లీ కాదు - తొలిసారి రూ.100 కోట్లు అందుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా?