Rohit Sharma Eknath Shinde: టీ 20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను కలిశారు. ముంబయిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో టీ20 ఛాంపియన్లు శిందేను కలిశారు. భారత క్రికెటర్లకు స్వాగతం పలికిన సీఎం ప్లేయర్లను అభినందించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ప్రపంచకప్ విశేషాలను కెప్టెన్ రోహిత్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచకప్‌లో తమ అనుభవాలు, స్వదేశంలో లభించిన అపూర్వ స్వాగతం గురించి ఏక్‌నాథ్ శిందేకు వివరించారు. అనంతరం సీఎం శిందే ఆటగాళ్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
#WATCH | Mumbai | Team India captain Rohit Sharma arrives at Varsha bungalow to meet Maharashtra CM Eknath Shinde after the Indian cricket team won T20I World Cup pic.twitter.com/aGs4WaFa6e
— ANI (@ANI) July 5, 2024
#WATCH | Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Shivam Dube and Yashasvi Jaiswal meet Maharashtra CM Eknath Shinde in Mumbai pic.twitter.com/zKqTdsWWB2
— ANI (@ANI) July 5, 2024
వీళ్లే ఎందుకు? కెప్టెన్ రోహిత్ సహా సూర్యకుమార్, శివమ్ దూబే యశస్వీ జైస్వాల్ మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు. వీరంతా దేశవాళీ క్రికెట్లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ముంబయికి చెందినవారు కాగా, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్ ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి వచ్చి స్థిరపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో భేటీ ముగిశాక ప్లేయర్లంతా శిందేతో కలిసి విధాన్ భవన్‌కు వెళ్లారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde felicitates Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Shivam Dube and Yashasvi Jaiswal pic.twitter.com/GMW96EuZdM
— ANI (@ANI) July 5, 2024
#WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde says, " i welcomed team india yesterday. today, rohit sharma came here, i thank him for it. we are proud that he is a world cup-winning player, and also that he is from mumbai. he is a down-to-earth person. i welcome all our players.… pic.twitter.com/gdu2yPfFx6
— ANI (@ANI) July 5, 2024
విధాన్ భవన్లో సత్కారం: విధాన్ భవన్‌లోనూ ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్లేయర్లను అధికారికంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం శిందేతోపాటు, డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడణవీస్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ మరాఠీలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. 'ముంబయి చా రాజా రోహిత్ శర్మ' అంటూ ఎమ్మెల్యేలు స్లోగన్స్ ఇచ్చారు. ఇక సీఎం శిందేకు రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు.
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Eknath Shinde along with Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Shivam Dube and Yashasvi Jaiswal arrives at Maharashtra Vidhan Bhavan where the cricketers will be felicitated. pic.twitter.com/IztDURQjNf
— ANI (@ANI) July 5, 2024
#WATCH | Mumbai | Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Shivam Dube and Yashasvi Jaiswal to be felicitated at Maharashtra Vidhan Bhavan in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis
— ANI (@ANI) July 5, 2024
(Source: Maharashtra Assembly) pic.twitter.com/xRWnax6B4j
#WATCH | Mumbai | Team India captain Rohit Sharma speaks in Maharashtra Vidhan Bhavan as Indian men's cricket team members are being felicitated by CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis
— ANI (@ANI) July 5, 2024
(Source: Maharashtra Assembly) pic.twitter.com/I51K2KqgDV
నిన్న ప్రధానితో భేటీ
2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి, గురువారం స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్‌ఇండియాకు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అపూర్వ స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన రోహిత్ సేన ముందు ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మోదీ, టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. టీ20 కప్పు గెలవడంపై ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.
టీమ్‌ఇండియాతో మోదీ స్పెషల్ చిట్‌చాట్ - ఏం ప్రశ్నలు అడిగారో తెలుసా? - Teamindia Modi Chit Chat
8 నెలల్లో రెండు సార్లు భేటీ - అది ఇది ఒకటి కాదు గురూ! - T20 World Cup 2024