ETV Bharat / sports

మయాంక్ మెరుపు వేగంతో లఖ్​నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024 - LSG VS PBKS IPL 2024

LSG VS PBKS IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ పోరులో గెలిచి లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ బోణీ కొట్టింది.

LSG VS PBKS IPL 2024
LSG VS PBKS IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 10:56 PM IST

Updated : Mar 31, 2024, 6:46 AM IST

LSG VS PBKS IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా తాజాగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ పోరులో గెలిచి లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్​పై ఓడిన ఆ జట్టు శనివారం జరిగిన మ్యాచ్​లో 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయాన్ని దక్కించుకుంది.

200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ టీమ్​ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శిఖర్​ ధావన్ సూపర్ ఇన్నింగ్ ఆడుతూ చెలరేగిపోయాడు. 50 బంతుల్లో 7×4, 3×6 సాయంతో 70 హాఫ్ సెంచరీ చేశాడు. బెయిర్‌స్టో (29 బంతుల్లో 3×4, 3×6 సాయంతో 42 పరుగులు చేశాడు. అలా వీరిద్దరు కలిసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినా ఆ తర్వాత ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. అరంగేట్ర బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ (3/27), మోసిన్‌ ఖాన్‌ (2/34) కలిసి పంజాబ్‌ను దెబ్బ కొట్టారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్​ చేసిన లఖ్‌నవూ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్‌ (38 బంతుల్లో 5×4, 2×6 సాయంతో 54 పరుగులు) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 3×4, 3×6 పరుగులు సాయంతో 42 పరుగులు) కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అయితే చివర్లో కృనాల్ పాండ్య (22 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 43 నాటౌట్‌) కూడా మెరుపులు మెరిపించాడు. ఫోర్లు సిక్సర్లు బాదుతూ చెలరేగిపోయాడు. ఇక పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ (3/28), అర్ష్‌దీప్‌ సింగ్ (2/30), కగిసో రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌కు బదులుగా నికోలస్‌ పూరన్‌ లఖ్‌నవూ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకున్నాడు.

లఖ్‌నవూ తుది జట్టు : నికోలస్ పూరన్‌ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, మోసిన్‌ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు: అష్టన్ టర్నర్, నవీనుల్ హక్‌, అమిత్ మిశ్రా, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్.

పంజాబ్‌ తుది జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

సబ్‌స్టిట్యూట్‌లు: ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసో, తనయ్, విద్వాత్ కావేరప్ప, హర్‌ప్రీత్ భాటియా

ఆర్సీబీతో మ్యాచ్​ - నా సూపర్​ ఇన్నింగ్స్​కు కారణం ఆమెనే : వెంకటేశ్ అయ్యర్​ - IPL 2024 RCB VS KKR

500 క్లబ్‌లోకి సునీల్ నరైన్ - ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా ఘనత - IPL 2024 RCB VS KKR

Last Updated : Mar 31, 2024, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.