ETV Bharat / sports

IPL హిస్టరీలో లాంగెస్ట్ సిక్స్- ఎన్ని మీటర్లో తెలుసా? - Longest Six In IPL Albie Morkel

Longest Six In IPL History: 2024 ఐపీఎల్ సీజన్ 17 మార్చి 22న ప్రారంభం కానుంది. గడిచిన 16 సీజన్లలో నమోదైన టాప్- 10 లాంగెస్ట్ సిక్స్​లు ఇవే!

Longest Six In IPL History
Longest Six In IPL History
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:24 PM IST

Longest Six In IPL History: ఐపీఎల్‌లో బ్యాటర్ల మెరుపులు బౌలర్లను విపరీతంగా డామినేట్ చేస్తాయి. ఈ టీ-20 లీగ్‌లో బౌండరీలే లక్ష్యంగా బరిలోకి దిగుతారు బ్యాటర్లు. ప్రతీ బంతిని ఫోర్ల్, సిక్స్​గా మలచాలని భావిస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి సిక్స్​ బాదితే బంతి స్టేడియం దాటి బయటపడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లాంగెస్ట్​ సిక్సర్ (Longest Six) బాదింది ఎవరో తెలుసా? ఈ టోర్నీలో టాప్​- 10 సిక్స్​లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మహేందర్ సింగ్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్​లో టాప్- 10 సిక్స్​ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. ధోనీ 2009లో 115 మీటర్ల సిక్సర్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక గతేడాది ఫాఫ్ డూప్లెసిస్​ కూడా లఖ్​నవూపై 115 మీటర్లు సిక్స్​ సంధించాడు.
  • గౌతమ్ గంభీర్: 2013లో గౌతమ్ గంభీర్ 117 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. 2022లో లియమ్ లివింగ్​స్టన్​ కూడా 117 మీటర్ల సిక్స్​ బాదాడు.
  • బెన్ కట్టింగ్: 2016 ఫైనల్​ మ్యాచ్​లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ బెన్ కట్టింగ్ బెంగళూరుపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్​లో కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
  • రాస్ టేలర్: 2008లో ఆర్సీబీ తరపున ఆడుతున్నప్పుడు,తాను కొట్టిన బంతి 119 మీటర్ల దూరం వెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై టేలర్ ఈ ఘనత సాధించాడు.
  • యువరాజ్ సింగ్: టీమ్ఇండియాలో సిక్స్​లకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ యువరాజ్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్​లో 6 బంతులకు 6 సిక్స్​లు బాది వరల్డ్​ రికార్డ్ కొట్టాడు. ఈ జోరు ఐపీఎల్​లోనూ కొనసాగించిన యువీ 2009లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నప్పుడు 119 మీటర్ల సిక్స్ కొట్టాడు.
  • క్రిస్ గేల్: క్రికెట్​లో సిక్స్​లకు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ పెట్టింది పేరు. యూనివర్సల్ బాస్​గా పేరున్న గేల్, ఈ 2013 ఎడిషన్​లో 119 మీటర్ల సిక్స్​ సంధించాడు.
  • రాబిన్ ఉతప్ప: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడో పొడవైన సిక్సర్ కొట్టిన రికార్డు రాబిన్ ఉతప్ప పేరిట ఉంది. 2010లో బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు ఉతప్ప ఈ ఘనత సాధించాడు. ఉతప్ప బ్యాట్ నుంచి 120 మీటర్ల సిక్సర్ వచ్చింది.
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్: 2011లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పంజాబ్​కు ఆడుతున్నప్పుడు ఐపీఎల్ లో రెండో పొడవైన సిక్స్ కొట్టాడు. గిల్‌క్రిస్ట్ దెబ్బకు బంతి 122 మీటర్ల దూరం వెళ్లింది.
  • ప్రవీణ్ కుమార్: ఐపీఎల్‌లో బౌలింగ్‌లో మంచి పేరున్న ప్రవీణ్ కుమార్ కూడా ఈ లీగ్‌లో టాప్ సిక్స్​ నమోదు చేశాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌పై ప్రవీణ్ 124 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు.
  • ఆల్బీ మోర్కెల్: ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్​ సిక్స్​ బాదిన బ్యాటర్​ ఆల్బీ మోర్కెల్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్నప్పుడు, మోర్కెల్ దిల్లీ క్యాపిటల్స్‌ (అప్పటి దిల్లీ డేర్​డెవిల్స్) పై 124 మీటర్ల దూరం సిక్స్ బాదాడు. దాదాపు 17 ఏళ్లుగా ఇదే ఐపీఎల్​లో లాంగెస్ట్​ సిక్స్​గా ఉంది.

ఈ క్రికెటర్లకు ఫుల్ టాలెంట్- అది మాత్రం కలిసి రాలేదు!

రాజకీయాల్లో క్రికెటర్ల మార్క్- MP టూ PM వరకు- అక్కడా కూడా ఈ స్టార్లదే హవా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.