Border Gavaskar Trophy South Africa Series Ruturaj Gaikwad : భారత జట్టును సోషల్ మీడియా నిర్ణయించదని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా జట్ల ఎంపికపై నెట్టింట్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20లు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ల కోసం జట్టులను ప్రకటించింది బీసీసీఐ.
ఈ జట్టులో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ, శివమ్ దూబెకు అవకాశం రాలేదు. గాయాల వల్ల వీరిని పక్కన పెట్టినట్లు తెలిసింది. పేస్ ఆల్‌రౌండర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడం విశేషం.
అయితే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించే రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం చోటు దక్కకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, సెలక్టర్ల తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారిపై మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియా - Aతో తలపడేందుకు సిద్ధమైన భారత్ - A జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రధాన జట్టులో ఎందుకు చోటు కల్పించలేదు? బ్యాకప్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకున్నప్పుడు రుతురాజ్ కనిపించలేదా? అని అభిమానులు ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతున్నారు.
మరి కొంతమంది రుతురాజ్ యెల్లో జెర్సీ (సీఎస్కే) వేసుకోవడం వల్లే ఇదంతా అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. గిల్ అద్భుత ప్రదర్శన చేయకపోయినా, కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్దగా రాణించక పోయినా వాళ్లను తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.
It's not your fault man .
— 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐭𝐌𝐒𝐃𝐢𝐚𝐧™ (@iamrya7) October 25, 2024
Yellow jersey is Burning Gambhir and Some other Mfs Ass 💔😩 . pic.twitter.com/qhrIsGKMNE
'రుతురాజ్, ఇషాన్ కిషన్ బీసీసీఐ సెలక్షన్‌కు నచ్చలేదు. అందుకే వారు రాణించినా రాజకీయాలు మాత్రం వారిని వెనక్కినెడుతున్నాయి', 'బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మంచిది. కచ్చితంగా భారత క్రికెట్ త్వరగానే పతనం అవుతుంది', 'ఫామ్‌లో ఉన్న క్రికెటర్లను పక్కనపెట్టడం కరెక్ట్ కాదు', 'అసలు రుతురాజ్ చేసిన తప్పేంటి? బీసీసీఐ సమాధానం ఇవ్వాలి.' అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 25, 2024
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- తెలుగు కుర్రాడికి లక్కీ ఛాన్స్
టీమ్ఇండియా టెస్ట్ బ్యాటింగ్ రివ్యూ - అలా చేయకపోతే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ బోల్తానే?