Jasprit Bumrah Yorker: విశాఖపట్టణం టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా, బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. బజ్‌బాల్ వ్యూహంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ప్రారంభంలో కాస్త దూకుడుగానే ఆడినప్పటికీ టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ స్టార్ పేసర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.
మొదట జో రూట్ (5)ను క్యాచౌట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా, గతమ్యాచ్ హీరో ఒలీ పోప్ (23)ను అద్భుతమైన యార్కర్‌తో వెనక్కిపంపాడు. 27 ఓవర్లో 5వ బంతిని బుమ్రా అద్భుతమైన యార్కర్‌గా సంధించాడు. ఈ బంతిని పోప్ డిఫెన్స్ ఆడబోయాడు. కానీ ఆ యార్కర్ ఎదుర్కొనేందుకు పోప్ అనుభవం సరిపోలేదు. అంతటి పర్ఫెక్ట్ యార్కర్ బంతి బ్యాట్‌ను తాకకుండా నేరుగా వికెట్లను తాకింది. దీంతో లెగ్ సైడ్ స్టంప్ ఓ మీటర్ దూరంలో ఎగిరి పండింది. అంతే ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. వారెవ్వా బుమ్రా అంటూ ప్రసంశించారు. రెండో రోజు ఆటలో ఈ బౌల్డ్ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. బుమ్రా యార్కర్ చూసిన నెటిజన్లు ఆతడిని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
బుమ్రా @150: ఈ మ్యాచ్‌లో బుమ్రా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 34 మ్యాచ్‌ల్లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. 49.2 వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (47 పరుగులు)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో బుమ్రా ఫీట్ అందుకున్నాడు. ఇక వేసిన ఇన్‌స్వింగ్ బంతికి స్టోక్స్ ఆశ్చర్యపోయాడు.ఆఖర్లో టామ్ హర్ల్టీ (21), జేమ్స్ అండర్సన్ (6)ను పెవిలియన్ చేర్చి బుమ్రా మొత్తం ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో బుమ్రా ప్రస్తుత టెస్టు వికెట్ల సంఖ్య 152కు చేరింది. ఇక బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది.