ETV Bharat / sports

బీసీసీఐ పట్ల ఇషాన్ అసంతృప్తి- ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయడమే కారణం! - Ind vs Eng Test Series 2024

Ishan Kishan Unhappy BCCI: యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బీసీసీఐ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా సిరీస్​ నుంచి ఇషాన్ తప్పుకున్న తర్వాత బీసీసీఐ రెండు సిరీస్​లకు అతడిని పక్కనపెట్టిెంది.

Ishan Kishan Unhappy BCCI
Ishan Kishan Unhappy BCCI
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 5:21 PM IST

Ishan Kishan Unhappy BCCI: టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ సెలక్షన్ కమిటీ మేనేజ్​మెంట్​పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతనెల అఫ్గానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​కు తనను పక్కనపెట్టి, జితేశ్ శర్మను జట్టులోకి తీసుకోవడం పట్ల ఇషాన్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్​లో జితేశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. దీంతో జితేశ్​ 2024 టీ20 వరల్డ్​ కప్​ రేస్​లోనూ ఉన్నాడన్న ప్రచారం సాగుతోంది.

అయితే అఫ్గాన్ సిరీస్​లో కెప్టెన్​ రోహిత్ శర్మతోపాటు, యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్​ను ప్రారంభించాడు. వన్​ డౌన్​లో విరాట్ కోహ్లీ, నెం.4లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ క్రమంగా జట్టు బ్యాటింగ్ ఆర్డర్​ పటిష్ఠంగా ఉంది. ఇక మిడిలార్డర్​లో జితేశ్, జడేజా ఉండడం వల్ల ఇషాన్​కు ప్లేస్ దక్కడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో టీ20ల్లో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీ ఎంట్రీ ఇవ్వడం డౌటే!

గతేడాది డిసెంబర్​లో సౌతాఫ్రిక పర్యటన నుంచి తప్పుకున్నాక, అఫ్గాన్, ఇంగ్లాండ్​ సిరీస్​కు బీసీసీఐ ఇషాన్​ను పక్కన పెట్టింది. ఇక ఇంగ్లాండ్​తో రీసెంట్​గా ముగిసిన టెస్టు మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇషాన్ విషయంపై స్పందించాడు. 'ఇషాన్ కిషన్​ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్​లో ఛాయిస్​గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్​మెంట్ ఇషాన్​తో టచ్​లోనే ఉంది' అని ద్రవిడ్ అన్నాడు. దీంతో ఇటీవల ఇషాన్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. జట్టులో స్థానమే లక్ష్యంగా నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులతో కలిసి రీసెంట్​గా ఇషాన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

కానీ, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇషాన్ ఆడడం లేదు. దీంతో ఇంగ్లాండ్​తో జరగనున్న మూడు టెస్టులకు కూడా ఇషాన్ టీమ్ఇండియాలో ఎంట్రీ ఇవ్వడం కష్టం. ఇక డైరెక్ట్​గా ఐపీఎల్​లోనే ఇషాన్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్​లో రాణించి మళ్లీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తే ఇషాన్​ను టీ20 వరల్డ్​కప్ టోర్నమెంట్​లో చూడవచ్చు!

గాడిలో పడ్డ ఇషాన్!- ప్రాక్టీస్ షురూ- ద్రవిడ్ మాటలు వర్కౌటైనట్లే?

విరాట్ కటౌట్​కు మొక్కిన క్రికెటర్- పీక్స్​లో కోహ్లీ క్రేజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.