ETV Bharat / sports

రంజీకి నో!- జిమ్​లో పాండ్యా, ఇషాన్ వర్కౌట్లు - ఇషాన్ కిషన్ టీమ్ఇండియా

Ishan Kishan Team India :రంజీ ట్రోఫీ ఆడని టీమ్​ఇండియా యంగ్​ ప్లేయర్ ఇషాన్‌ కిషన్‌ తాజాగా మరో ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కనిపించాడు. ఆ విశేషాలు మీ కోసం

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 12:06 PM IST

Ishan Kishan Team India : టీమ్ఇండియా ప్లేయర్లు రంజీ ట్రోఫీలో పాల్గొనాలన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. ఇప్పటికే దీనిపై బీసీసీఐ తాజాగా ఓ అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ కొందరు క్రికెటర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల నడుమ వేళ యంగ్​ ప్లేయర్ ఇషాన్‌ కిషన్​ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందులో మరో క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఉండటం గమనార్హం

ఇంతకీ ఏం జరిగిందంటే ?
మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలో జట్టుకు ఇషాన్‌ దూరమైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటున్న అతడు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆటడం లేదు. అయితే దీనిపై ఇషాన్​ సరైన స్పష్టత ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐ కన్నెర్రజేసింది. ఇక ఇషాన్​తో పాటు పలువురు టీమ్ఇండియా ప్లేయర్లు కూడా వివిధ కారణాల వల్ల రంజీ మ్యాచ్​లు ఆడకపోవడం ఇప్పుడు క్రికెట్​లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.

దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే జాతీయ జట్టులోకి తీసుకుంటామంటూ ఇటీవల బోర్డు గట్టిగా చెప్పింది. అయినా కూడా ఇషాన్ తన రాష్ట్ర క్రికెట్‌ సంఘాన్ని సంప్రదించలేదు. ఇదంతా ఒక ఎత్తైతై ఇప్పుడు ఇషాన్‌ వీడియో వైరల్‌ అవడం మరించ చర్చలకు దారితీస్తోంది. గతంలోనూ అతడు పాండ్యాతో కలిసి వర్కౌట్స్​ చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

శ్రేయస్​ కూడా
ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్​లో గాయపడ్డ ఈ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతనే అతడ్ని రంజీల్లో ఆడించాలంటూ బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అయితే, గాయం కారణంగా రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆటకు శ్రేయస్ అందుబాటులోకి లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడంటూ చెప్పడం గమనార్హం. దీంతో బీసీసీఐ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది

ఇషాన్​పై జై షా ఫైర్- వాళ్లకు కూడా వార్నింగ్!

గాయమని రంజీ మ్యాచ్‌కు దూరం - శ్రేయస్‌ ఫిట్‌గా ఉన్నాడంటున్న ఎన్‌సీఏ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.