ETV Bharat / sports

SRH x MI- సన్​రైజర్సే కాదు- ముంబయిదీ రికార్డే - IPL Mumbai Indian Records

IPL Mumbai Indian Records: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్- ముంబయి మ్యాచ్​లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిస్తే, ముంబయి కూడా ఓ రికార్డు సొంతం చేసుకుంది. అదేంటంటే

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 11:04 AM IST

Updated : Mar 28, 2024, 12:11 PM IST

IPL Mumbai Indian Records: ఉప్పల్​ వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్​లో అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. సీజన్ 17లో భాగంగా బుధవారం ముంబయి ఇండియన్స్​తో తలపడ్డ సన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 277-3 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్​ పేరిట ఉన్న పాత రికార్డు (263-5)ను బద్దలుకొట్టి కొత్త చరిత్ర రాసింది. అయితే ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​ ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్​ కూడా ఓ రికార్డు సాధించింది.

278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి ప్రయత్నిస్తే తప్పేం ఉంది అన్నట్లు మొదట్నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ గట్టి పునాది వేస్తే, దాన్ని తెలుగు తేజం తిలక్ వర్మ, నమన్ దీర్ కొనసాగించారు. ఒక దశలో ముంబయి గెలిచి చరిత్ర తిరగరాస్తుందేమో అనిపించింది. కానీ, ఆఖర్లో సన్​రైజర్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని ముంబయిని కట్టడి చేశారు. అయితే ఛేదనలో ముంబయి 20 ఓవర్లకు 246/5 స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబయి రికార్డు కొట్టింది.

అయితే ఐపీఎల్​ హిస్టరీలోనే ఛేజింగ్​లో టాప్ స్కోర్ బాదినా ముంబయికి ఈ మ్యాచ్​లో ఓటమి తప్పలేదు. సన్​రైజర్స్ హైదరాబాద్ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్​లో ఛేజింగ్​లో అత్యధిక స్కోర్లు (220+) బాదినప్పటికీ ఆయా జట్లు ఓడిన సందర్భాలు ఉన్నాయి. మరి అవేటంటే?

ముంబయి vs పంజాబ్- 223/6 (2017): 2017 ఐపీఎల్​ లీగ్ మ్యాచ్​లో భాగంగా ముంబయి- పంజాబ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లకు 203-3 పరుగులు చేసింది. అనంతరం 231 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన ముంబయి ఓవర్లన్నీ ఆడి 223-6 వద్ద ఆగిపోయింది. దీంతో ముంబయిపై పంజాబ్ 7 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గింది.

రాజస్థాన్ vs చెన్నై- 223/5 (2010): ఐపీఎల్ సీజన్- 3లో రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో చెన్నై నిర్దేశించిన 247 భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ దీటుగా ఆడింది. కానీ, 20 ఓవర్లకు రాజస్థాన్ 223-5 పరుగులే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ఓడింది.

ఐపీఎల్​లో హిట్​మ్యాన్ మరో అరుదైన రికార్డు - అప్పుడు ధోనీ, సచిన్ - ఇప్పుడు రోహిత్ - Rohit Sharma 200th IPL

హార్దిక్ - బుమ్రా - రోహిత్ మధ్య వివాదం - అసలేం జరుగుతోంది? - IPL 2024 GT VS MI

Last Updated : Mar 28, 2024, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.