ETV Bharat / sports

ఐపీఎల్​లో ఛీర్​ లీడర్సే స్పెషల్ అట్రాక్షన్​ - ఒక్కో మ్యాచ్​కు ఎంత సంపాదిస్తున్నారంటే? - IPL Cheerleaders Remuneration

IPL Cheerleaders Remuneration : ప్రపంచంలోని రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ లీగ్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఒకటి. ఐపీఎల్ స్థాయిలో మరే క్రికెట్‌ టోర్నీ ప్లేయర్‌లకు డబ్బులు చెల్లించదు. అందుకే అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్‌ అనగానే స్టేడియం దాటే సిక్సులు, గాల్లో ఎగిరే వికెట్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లే కాదు బౌండరీ లైన్‌ వద్ద అందంగా డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచే ఛీర్‌ లీడర్స్‌ కూడా గుర్తొస్తారు. ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో ఛీర్‌లీడర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. తమ జట్టు సాధించిన ప్రతి బౌండరీ, వికెట్‌ను అదిరిపోయే స్టెప్పులతో సెలబ్రేట్‌ చేస్తారు. అయితే ఈ అందమైన భామల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

IPL Cheerleaders Remuneration
IPL Cheerleaders Remuneration
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 7:38 PM IST

IPL Cheerleaders Remuneration : అతి త్వరలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ మొదలు కాబోతోంది. మార్చి 22న శుక్రవారం మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఢీకొట్టబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తరఫున ఛీర్‌లీడర్స్‌ కూడా అందమైన విన్యాసాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అందమైన భామలకు ఐపీఎల్‌లో ఎంత ఆదాయం అందుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే..

సాధారణంగా ప్రతి మ్యాచ్‌లో ఛీర్‌ లీడర్స్‌కు మంచి రెమ్యూనరేషన్ లభిస్తుంటుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఛీర్‌ లీడర్‌లు ఒక్కో మ్యాచ్‌కి దాదాపు రూ.14,000 నుంచి రూ.25,000 రూపాయల వరకు అందుకుంటారట. అయితే ఈ మొత్తం ఆయా ఫ్రాంచైజీలను బట్టి మారుతూ ఉంటుందని సమాచారం. అందరూ ఒకే మొత్తాన్ని ఆఫర్‌ చేయకపోవచ్చు అని కూడా తెలుస్తోంది.

ఆ రెండూ ఫ్రీ
చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ ఛీర్‌ లీడర్‌లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.12,000 పైగా చెల్లిస్తాయట. ముంబయి ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు సుమారు రూ. 20,000 చెల్లిస్తాయని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ఫ్రాంచైజీ తమ ఛీర్‌ లీడర్‌లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.24,000 నుంచి రూ.25,000 రూపాయల మధ్య చెల్లిస్తుందని సమాచారం.

అయితే చాలా మంది ఛీర్‌లీడర్‌లు విదేశాల నుంచి వస్తుంటారు. దీంతో వారికి రెమ్యూనరేషన్​తో పాటు భారత్​లో ఉన్న సమయంలో విలాసవంతమైన వసతి, రోజువారీ ఆహారం, ఇతర సౌకర్యాలు వంటి ప్రయోజనాలు లభిస్తాయట. ఈ ఖర్చులను కూడా ఆయా ఫ్రాంచైజీలే భరిస్తాయని సమారం. తమ క్రికెట్ జట్టు బాగా రాణిస్తే ఈ ఆదాయంతో పాటు, ఛీర్‌లీడర్‌లకు ప్రత్యేకంగా కొంత బోనస్‌ అమౌంట్‌ అందజేస్తారట. టోర్నీ గెలిచిన తర్వాత కూడా కొంత డబ్బు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అది అంత ఈజీ కాదు
ఛీర్‌లీడర్‌గా మారడం అంత సులభం కాదు. డ్యాన్స్, మోడలింగ్, ప్రేక్షకుల ముందు పర్ఫార్మ్‌ చేయడంలో అనుభవం ఆధారంగా వీరిని సెలక్ట్‌ చేస్తారు. ఐపీఎల్‌ ఛీర్‌లీడర్ రోల్‌కి ఆడిషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు ప్రిపేర్డ్‌ పర్ఫార్మెన్స్‌తో సిద్ధంగా ఉండాలి. ఆడిషన్‌లో సెలక్ట్‌ అయిన తర్వాతనే ఐపీఎల్‌లో ప్రేక్షకులను అలరించే రోల్ లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

IPL 2023 LSG VS MI : పాపం చీర్​గర్ల్స్​​.. ముంబయి చేసిన పనికి బాగా ఏడ్చేశారు!

IPL: ఐపీఎల్​పై చీర్​లీడర్​ షాకింగ్​ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.