ETV Bharat / sports

రోహిత్‌కు వెన్నునొప్పి -​ అందుకే కోల్​కతా మ్యాచ్​లో అలా - IPL 2024 Mumbai indians - IPL 2024 MUMBAI INDIANS

IPL 2024 Rohith Sharma : కోల్‌కతాతో జరిగిన పోరులో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్​గా రావడానికి వెనక అసలు కారణం ఏంటో తెలిపాడు సీనియర్ ప్లేయర్​ పీయూశ్‌ చావ్లా. ఏం చెప్పాడంటే? Source ANI

IPL 2024 Rohith Sharma
IPL 2024 Rohith Sharma (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 1:30 PM IST

IPL 2024 Rohith Sharma : ఐపీఎల్​లో ముంబయికి ఐదు టైటిళ్లు అందించిన ఘనత కెప్టెన్​ రోహిత్‌ శర్మది. కానీ అతడిని పక్కకు పెట్టి హార్దిక్​​ పాండ్యకు ఈ సీజన్​లో నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే హార్దిక్ కెప్టెన్సీలో ముంబయి విఫలమైంది. వరుస పరాజయాలతో ముందుకెళ్తోంది. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిని అందుకుంది. అయితే ఈ మ్యాచ్​లో స్టార్ ప్లేయర్​ అయిన రోహిత్​ను ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ల జాబితాలో చేర్చింది యాజమాన్యం.

అందులోనూ లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (11) క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. కేవలం ఒక్క సిక్స్ మాత్రమే బాది కుదురుకున్నట్లే కనిపించినప్పటికీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ ప్లేయింగ్​ 11లో మైదానంలోకి దిగిన హిట్​ మ్యాన్​ కోల్‌కతాతో పోరులో రాకపోవడంతో అతడికి ఏమైందనే అనుమానం అందరిలో నెలకొంది. అసలే ఐపీఎల్ పూర్తైన తర్వాత అతడు టీ20 వరల్డ్​ కప్‌ కూడా ఆడాల్సి ఉంది. దీంతో ఈ విషయంపై ముంబయి సీనియర్ ప్లేయర్​ పీయూశ్‌ చావ్లా స్పందించాడు. రోహిత్ ఇంపాక్ట్‌ రోల్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

"రోహిత్​కు లైట్​గా వెన్ను నొప్పి ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడికి రెస్ట్​ ఇవ్వాలని అనుకున్నాం. అందుకే, ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి పంపలేదు. అందుకే బ్యాటింగ్​కు మాత్రమే దిగాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి పర్వాలేదు. కోల్‌కతాతో మ్యాచ్‌లో పిచ్‌ను నిందించలేం. అంతా బానే ఉంది. కేకేఆర్‌ బౌలర్లు అద్భుతంగా ఆడారు. మాకు ఈ రోజు బ్యాడ్ డే. రాబోయే మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేస్తాం. గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించేలా ప్రదర్శన చేస్తాం. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తామా? లేదా? అనే విషయం గురించి పట్టించుకోం. టీ20 క్రికెట్‌లో కేవలం ఒక్క దానిపైనే డిపెండ్ అవ్వలేను. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా ఎంతో ముఖ్యం. ప్రతి జట్టు తమకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది" అని పీయూశ్‌ పేర్కొన్నాడు.

Source ANI
Source ANI (Source ANI)

రోహిత్ శర్మ చెత్త రికార్డ్​ - అత్యధిక సార్లు ఆ బౌలర్​ చేతిలోనే! - IPL 2024

ముంబయిపై కోల్​కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.