T20 Worldcup 2024 : "వరుస మ్యాచ్‌లతో అలసిపోయి టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లడం ఎంతవరకూ కరెక్ట్. కమర్షియల్ లీగ్ అయిన ఐపీఎల్‌లో గాయాలకు గురై, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే ప్లేయర్లకు వెంటనే మరో మెగా ఈవెంట్‌కు రెడీ కావాలంటే ఎంత కష్టం. 50 రోజుల పాటు విరామం లేకుండా ఆడి అలసటకు గురై జూన్ 2న ఆరంభం కానున్న టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటాలంటే పెను సవాలే కదా." అన్న మాటలు మరోసారి వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్లో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడి ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ వేటకు వెళ్లడం, అక్కడ అప్పటికే అలసటకు గురైన ప్లేయర్స్ అంతంతమాత్రంగా ప్రదర్శన చేయడం, ఫైనల్‌గా పోరాటం మధ్యలోనే మనోళ్ల ఆట ముగిసిపోవడం, గత కొన్ని పర్యాయాల నుంచి సాగుతూ వస్తోంది. అందుకే ఈసారి కూడా మళ్లీ అలాంటి కథే పునరావృతం అవుతుందా అన్న సందేహాలు క్రికెట్ అభిమానుల్లో వస్తున్నాయి.
టీమిండియా ప్లేయర్ల మాట అటుంచితే విదేశీ ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ మధ్యలోనే బ్రేక్ తీసుకుని పొట్టి సమరానికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చెందిన ప్లేయర్లెవరూ ఐపీఎల్ చివరి దశలో అందుబాటులో ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన బట్లర్, బెయిర్ స్టో, ఫిల్‌సాల్ట్, శామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్‌స్టన్ ప్లే ఆఫ్స్‌కు ముందే ఐపీఎల్‌కు బై బై చెప్పేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, వార్నర్‌లకు కూడా ఐపీఎల్‌లో తగినంత విశ్రాంతి లభిస్తోంది.
అలా విదేశీ ప్లేయర్లు అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన టీ20 వరల్డ్ కప్‌కు అంత ప్రాధాన్యతనిస్తుంటే, టీమిండియా ప్లేయర్లకు ఆ వెసలుబాటు కనిపించడం లేదు. పోనీ లీగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న వారిని రొటేట్ చేస్తూ అలసటకు గురికాకుండా కూడా చూసుకోవడం లేదు. దీంతో ఐపీఎల్ ప్రభావం టీ20 ప్రపంచ కప్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- గాయాల నుంచి కోలుకుని ఫిట్‌నెస్ తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడిప్పుడే ఐపీఎల్‌లో రాణిస్తూ వరుస మ్యాచ్‌లు ఆడుతున్నాడు.
- ఫామ్‌లో లేకపోయినా ప్రతి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటం, ఫామ్ లేమిపై భావోద్వేగానికి గురికావడం వంటి వాటి వల్ల ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ.
- ఐపీఎల్ మ్యాచ్‌లకు బ్రేక్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్ రీసెంట్‌గా మళ్లీ లీగ్ లోకి అడుగుపెట్టాడు. వరుస మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉంటున్నాడు.
సాధారణంగా ఐపీఎల్ అంటేనే హోరాహోరీగా జరిగే కమర్షియల్ లీగ్. ప్రతిభ ఆధారంగా ధర పలికే లీగ్ కావడంతో ప్లేయర్లు ప్రాణం పెట్టి ఆడేస్తారు. అలాంటి సమయంలోనే గాయాలకు గురై, రెస్ట్ అవసరం అవుతూ ఉంటుంది. కానీ, ఈ లీగ్ ముగిసిన ఒక వారం గ్యాప్‌లో అమెరికా ఆతిథ్యమిస్తూ మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ప్లేయర్లను రాణించడమనేది కాస్త కష్టమైన విషయమే.
చాహల్ అదిరే రికార్డ్ - టీ20 క్రికెట్లో తొలి భారత బౌలర్‌గా - IPL 2024 Chahal
ఆన్లైన్లో టీ20 ప్రపంచకప్ జెర్సీ - మీరూ సొంతం చేసుకోవాలా? - ధర ఎంతంటే? - T20 World Cup 2024 Jersey